Pawan kalyan: “బ్రో” బ్రేక్ ఈవెన్ అయిన ఫస్ట్ ఏరియా ఇదే!

This is the first area where “bro” breaks even!

టాలీవుడ్ లో ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయిన పెద్ద సినిమా “బ్రో”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా జులై28న రిలీజ్ అయి డీసెంట్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఏమాత్రం హైప్ లేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడన్న ఒక్క హైప్ తోనే ఈ సినిమా రిలీజ్ అయింది. అందువల్ల “బ్రో” సినిమాకి ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోల్చితే “బ్రో” కి మంచి టాక్ వచ్చినప్పటికీ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల థియేటర్లో పెద్దగా ఆడడం లేదు.

అయితే ఈ సినిమాకి లిమిటెడ్ షోస్ పడడం వల్ల ఎక్కువ వసూళ్లు రాలేదని చెప్పాలి. అయితే ఉన్న షోస్ కి ఓపెనింగ్స్ కరెక్టుగానే సింక్ అయ్యాయని చెప్పొచ్చు. మొదటి మూడు రోజుల్లో 55కోట్లకి పైగా షేర్ సాధించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించిందని చెప్పొచ్చు. ఇక “బ్రో” సినిమా ఒక ఏరియా లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపొయింది. చాలా మంది ఆ ఏరియా ఓవర్సీస్ అని అనుకున్నారు కానీ కాదు.

“బ్రో” బ్రేక్ ఈవెన్ అయిన ఏరియా కర్ణాటక. అవును.. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి బ్రో సినిమా 5కోట్ల బిజినెస్ చేయగా, కేవలం నాలుగు రోజుల్లో అక్కడ 5కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి, ఐదవ రోజు తో లాభాల్లోకి అడుగుపెట్టింది. అయితే వర్కింగ్ డే లో ఈ సినిమా చాలా స్లో అయిపోయింది. అందువల్ల వసూలు చాలా పడిపోయాయి. ఇంకా బ్రో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో ముప్పై కోట్లయినా వసూలు చేయాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు