Baby movie controversy: వివాదానికి తెర తీసింది విశ్వక్ సేన్- బేబీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Baby movie controversy

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన బేబీ సినిమా ఒకపక్క థియేటర్స్ లో సంచలన విజయాన్ని సాధిస్తూనే, మరోపక్క పలు వివాదాలకు దారి తీస్తుంది. బేబీ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సాయి రాజేష్ కు విశ్వక్ సేన్ కు మధ్య జరుగుతున్న ఈ వివాదం నానాటికి పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు.

ఇటీవలనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్ విశ్వక్ సేన్ మాట్లాడిన మాటలకూ అభ్యతరం వ్యక్తం చేసాడు. అసలు వివాదాన్ని మొదలు పెట్టిందే విశ్వక్ సేన్ అంటూ విరుచుకుపడ్డాడు. దాంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

అసలు విషయం ఏంటంటే బేబీ మూవీ చిన్న సినిమాగా రిలీజై, థియేటర్స్ లో ఘన విజయం సాధించటంతో సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. అయితే ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ కథను ఒక హీరో రిజెక్ట్ చేశాడంటూ క్యాజువల్ గా స్టేజ్ పైన మాట్లాడాడు. దాంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కాగా ఆ స్పీచ్ వైరల్ అవుతుందన్న విషయాన్ని గ్రహించిన విశ్వక్ సేన్ ట్విట్టర్ లో సాయి రాజేష్ స్పీచ్ పై పరోక్షంగా ట్విట్ చేయడంతో.. సోషల్ మీడియాలో అయితే బేబీ సినిమా రిజెక్ట్ చేసిన ఆ హీరో విశ్వక్ సేన్అం టూ ప్రచారం జరిగింది. అయితే ఈ విధంగా కెలికి గిల్లించుకోవడం విశ్వక్ సేన్ కు ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఓవర్ యాక్షన్ పనులు చాలానే చేసాడు. అక్కడితో ఆగకుండా ఇటీవలనే ఒక సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లి మళ్ళీ వివాదాన్ని కెలికాడు.

- Advertisement -

ఇక ఆ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటలకూ సాయి రాజేష్ లేటెస్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. అసలు వివాదాన్ని స్టార్ట్ చేసింది విశ్వక్. నేను స్టేజ్ పైన ఒక హీరో చెప్పాడని చెప్పి వదిలేసాక ఆ మ్యాటర్ ను పబ్లిక్ చేసింది విశ్వక్ అంటూ ఇంటర్వ్యూలో తెలిపారు బేబీ కథ విశ్వక్ చెబుతామనుకున్న కానీ ఆయన వినలేదు పైగా నన్ను మాటలు అన్నాడు. అయిన కూడా నేనేం రియాక్ట్ అవ్వలేదు, కానీ ఇటీవలనే విశ్వక్ సినిమా హిట్ అయితే ఎంజాయ్ చేయాలి గాని విమర్శించవద్దు అని మాట్లాడటం తాను బాధ కలిగించిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఆయనకు నాతో వర్క్ ఇష్టం లేకపోతే నో చెప్పడం ఒకే గాని ఆ నో చెప్పే విధానం కూడా మర్యాదగా ఉండాలని ఆయన తెలిపారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు