Marvels: డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్..

Guardians of the Galaxy vol 3 digital premiere

హాలీవుడ్ సినిమాల్లో మార్వెల్ మూవీస్ కి ఉండే ప్రత్యేకత వేరు. ఈ జోనర్ లో ఏ మూవీ వచ్చినా సూపర్ హిట్ అవుతుంది. చిన్న పిల్లల నుండి ముసలోళ్ల దాకా అందరు ఆదరించే సినిమాలు ఈ నిర్మాణ సంస్థ నుండి వస్తాయి. ఇక ఈ ప్రొడక్షన్ సంస్థ నుండి వచ్చిన “గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ” సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవెంజర్స్ సీరీస్ తర్వాత ఆ రేంజ్ లో ఇంప్రెస్స్ చేసిన సిరీస్ ఇది.

ఇక ఈ సిరీస్ లో తాజాగా వచ్చిన సినిమా “గార్డియన్స్ అఫ్ ది గేలక్సీ VOL 3”. ఈ సిరీస్ లో వచ్చిన చిత్రాలన్నింటిలో అన్నిటికంటే బాగా ఎమోషనల్ గా ఆకట్టుకున్న సినిమా ఇదే. గార్డియన్స్ గ్యాంగ్ లో ఒకరైన రాకెట్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రాకెట్ రోల్ ఎమోషన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఫలితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 2023 లో హైయెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఒక ఈ సీరిస్ నుండి వచ్చిన ఆఖరి కథ ఇదేనని మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది. ప్రముఖ ఓటిటి సంస్థ అయిన హాట్ స్టార్ లో ఈరోజు నుండి “గార్డియన్స్ అఫ్ ది గేలక్సీ” ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ లో ఈ సినిమా టెలిక్యాస్ట్ అవుతుంది. మరి థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ఓటిటి ఏ రేంజ్ లో ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా పలు థియేటర్లలో ఇప్పటికి ఆడుతూనే ఉండడం విశేషం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు