Kubera : బెగ్గర్ టు బాద్ షా గా కనిపించడానికి రెడీ అయ్యాడు!

Kubera : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టిజియెస్ట్ మూవీస్ లో శేఖర్ కమ్ముల ధనుష్- నాగార్జున మూవీ “కుబేర” కూడా ఒకటి. టాలీవుడ్ మూవీ అనడం కన్నా పాన్ ఇండియా మూవీ అనొచ్చేమో. ఎందుకంటే మూవీ ఆ రేంజ్ లో తెరకెక్కుతుంది. ఎవరూ ఊహించని విధంగా సెట్ అయిన ఈ క్రేజీ కాంబో లాస్ట్ ఇయరే షూటింగ్ స్టార్ట్ అయినా ధనుష్ కెప్టెన్ మిల్లర్ వల్ల కొన్ని రోజులు షూటింగ్ జరుపుకోలేదు. ఇక ధనుష్ తాను నటిస్తున్న ఇతర సినిమాల షూటింగ్ కంటే కూడా శేఖర్ కమ్ముల సినిమాపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాయన్ సినిమా కంటే ముందే ఈ సినిమా ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడు. అందుకే వరుస షెడ్యూల్స్ లో హైదరాబాద్ లోనే ధనుష్ సందడి చేస్తున్నాడు. ఇక శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డ్ తెలిసిందే. చిన్న సినిమా తీసినా అందులో పెర్ఫార్మన్స్ రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సౌత్ మొత్తంఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ పై ఉన్న అంచనాలని అమాంతం పెంచేసింది.

టీజర్ రెడీ..

ఇక ధనుష్ శేఖర్ కమ్ముల కుబేర అప్పుడే టీజర్ రిలీజ్ కి రెడీ అయిందని సమాచారం. మే 2న కుబేర మూవీ టీజర్ ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక కుబేర మూవీ లో ధనుష్ బెగ్గర్ దశ నుండి రిచెస్ట్ మ్యాన్ గా ఎలా మారాడన్న కథాంశంతో సినిమా చూపిస్తున్నారని తెలుస్తుంది. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో హై ఇంపాక్ట్ క్రియేట్ చేసారు మేకర్స్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క తాజా షూటింగ్ షెడ్యూల్ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. అక్కడ షూటింగ్ చేస్తూనే కుబేర టీజర్‌ను మే 2, 2024న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ధనుష్ బిచ్చగాడుగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన టీం టీజర్ తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.

బెగ్గర్ టు బాద్ షా..

ఇక ధనుష్ కుబేర (Kubera) ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే స్టోరీ కాన్సెప్ట్ కి సంబంధించిన హింట్ ఇచ్చేసారు. బిచ్చగాడి నుండి కోటీశ్వరుడిగా ఎదిగే వైనం సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తుంది. అందుకే కుబేర అని టైటిల్ పెట్టారు. ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో శివుడి ఫోటోని కూడా చూపించారు. దేవతల్లో శివుడి దగ్గర బూడిద తప్ప ఇంకేమి ఉండదని అంటారు. మరి సినిమా కాన్సెప్ట్ ఈ పాటికే అర్ధమైపోయి ఉండాలి. ఇక నాగార్జున ని ఎలా చూపిస్తున్నారో కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శేఖర్ కమ్ములతో దేవిశ్రీ పనిచేయడం కూడా ఇదే మొదటి సరి కావడం విశేషం. ఇక కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మరియు అమిగోస్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి మే 2న రిలీజ్ అవ్వబోతున్న కుబేర టీజర్ తో శేఖర్ కమ్ముల ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నాడో, సినిమాలో ధనుష్ ని ఎలా చూపించబోతున్నాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు