Chandini Chowdary: నెటిజన్స్ ట్రోల్స్..అలా అనలేదంటూ క్లారిటీ..!

Chandini Chowdary.. కలర్ ఫొటో సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ చాందిని చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కొత్త కొత్త పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమే మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈ సినిమాలో అజయ్ ఘోష్ సరసన నటిస్తూ కొత్త కథతో థియేటర్లోకి రాబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు..

Chandini Chowdary: Netizens are trolls..clarity that they are not saying that..!
Chandini Chowdary: Netizens are trolls..clarity that they are not saying that..!

మాది ఆంధ్ర.. టీం లేదు కదా..

ఇకపోతే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఒక మీడియా ప్రతినిధి హీరోయిన్ ను ఉద్దేశిస్తూ.. మీ ఫేవరెట్ ఐపిఎల్ టీం ఏంటి? అని అడగ్గా దానికి హీరోయిన్ సమాధానం ఇస్తూ.. ఇప్పటివరకు ఒక్క సారి కూడా క్రికెట్ స్టేడియంలో ఐపీహెచ్ మ్యాచ్ చూడలేదు.. కాకపోతే కేవలం సిసిఎల్ మ్యాచ్లు మాత్రమే చూశాను అంటూ చెప్పుకొచ్చింది.. ఇకపోతే ఒక్క మ్యాచ్ అయిన ఐపీఎల్ మ్యాచ్ చూసి తర్వాత తాను టీమ్స్ నుంచి ఏది ఫేవరెట్ అని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. అంతేకాదు మాది ఆంధ్ర కాబట్టి మా ఆంధ్రకు టీం లేదు అని కూడా తెలిపింది చాందిని చౌదరి.. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ టీం ఉంది కదా అని అంటే.. మాది ఆంధ్ర ..మాకు ఆంధ్ర టీం లేదు అంటూ ఆమె తెలిపింది. దీంతో కొంతమంది ఆమె తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ టీం ను ఓన్ చేసుకోలేకపోతోంది.. అయితే ఆమె సినిమాలు కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రమే చూస్తున్నారా ? తెలంగాణ వాళ్లు చూడడం లేదా అంటూ గట్టిగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ అంశం కాస్త దారి తప్పేలా కనిపించడంతో వెంటనే సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ..

ట్రోల్స్ పై క్లారిటీ..

నా ఫేవరెట్ ఐపిఎల్ టీం ఏది అని అడిగితే నేను మ్యాచ్ లు చూస్తాను.. చూసిన తర్వాతే చెబుతాను అన్నాను.. అలాగే నేను ఆంధ్ర నుంచి వచ్చాను కాబట్టి ఆంధ్ర టీం కూడా ఉంటే బాగుండు అన్నాను.. కానీ ట్రెండింగ్ కంటెంట్ కి తగ్గట్టు వీడియో ఎడిట్ చేసి అవుట్ ఆఫ్ కాంటెక్ట్స్ లో వీడియోలు పెట్టడం చాలా సులభం కదా.. నేను నా రెండు తెలుగు రాష్ట్రాలను చూసి గర్విస్తాను.. ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాలకు నేను చెందిన దాన్ని కాబట్టి.. ఈ ఏడాది హైదరాబాదు జట్టుకి ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను అంటూ రాసుకువచ్చింది.. మొత్తానికైతే గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.. అందుకే ఈ సమస్య పెద్దదిగా మారకముందే సోషల్ మీడియా ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చేసింది చాందిని చౌదరి. ప్రస్తుతం మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాతో రాబోతుంది కాబట్టి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు