Sadaa: అతన్ని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ?

Sadaa: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది లోకల్ అయితే కొంతమంది నాన్ లోకల్ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేయకపోతే సక్సెస్ కావడం లేదు. కానీ ఎక్స్పోజింగ్ చేయకుండా కూడా కొంతమంది హీరోయిన్లు సక్సెస్ అయ్యారు. అలాంటి హీరోయిన్లలో సదా ఒకరు. హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం అలాగే అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది హీరోయిన్ సదా. తన కెరీర్లో మొదటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చేయకుండానే ఇండస్ట్రీలో రాణించింది. ఇప్పటికి కూడా ఈ బ్యూటీ కి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

హీరోయిన్ సదా తన కెరీర్ లో అనేక సినిమాలు చేసింది. ముఖ్యంగా హీరో నితిన్ తో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో నటించిన సదా కెరీర్ ప్రారంభంలో ఈ బంపర్ హిట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వెనక్కి చూసుకోలేదు. ఆ తర్వాత వరుసగా పెద్ద స్టార్ హీరోల సరసన చేసింది. తనదైన నటనతో ఆకట్టుకున్న సదా ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలలో ఛాన్స్ కొట్టేసి బంపర్ విజయాలను అందుకుంది.

ఇక తెలుగుతోపాటు తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ముఖ్యంగా అపరిచితుడు సినిమాతో బంపర్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం టీవీ షోలకు జడ్జిగా కూడా పనిచేస్తుంది సదా. అయితే నాలుగు పదుల వయసు వచ్చినప్పటికి పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది సదా. ఈ క్రమంలో తమిళ హీరో మాధవన్ తో ప్రేమాయణం నడిపించిందట సదా. దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రేమించిందట. ప్రియసఖి, నాన్ అవనాలు సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట.

- Advertisement -

అయితే.. తాజాగా సమాచారం ప్రకారం.. హీరోయిన్ సదా పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యారట. తమిళనాడుకు చెందిన ఓ బిజీనెస్‌ మెన్‌ ను హీరోయిన్ సదా పెళ్లి చేసుకోనున్నారట. దీనికి హీరోయిన్ సదా కూడా ఒప్పుకున్నారట. ఇంట్లో పెద్దలు ఈ సంబంధం కుదిర్చారట. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు