Kubera Movie: ధనుష్ మూవీకి మళ్లీ చిక్కులు… టైటిల్ పై వివాదం

Kubera Movie : నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కుబేర. నాగార్జున కూడా ఇందులో ప్రధాన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఈ మూవీ చిక్కుల్లో పడినట్టుగా తెలుస్తోంది. కొత్తగా ఇప్పుడు కుబేర టైటిల్ వివాదం తెరపైకి వచ్చింది. మరి ఇంతకీ ధనుష్ మూవీ విషయంలో ఏం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

కుబేర మూవీలో మొట్టమొదటిసారి ధనుష్, నాగార్జున కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. శేఖర్ కమ్ముల ఈ మూవీతో తన పంథాను మార్చి ఛాలెంజింగ్ జానర్ లో సినిమాను తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కుబేర మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ జిమ్ సర్బ్ కీలకపాత్ర నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహహన రావు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా శివరాత్రి కానుకగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఈ మూవీలో ధనుష్ ను బిచ్చగాడిగా చూపించి సర్ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ బ్యాంకాక్ లో మొదలైంది అంటూ వర్కింగ్ స్టిల్స్ ను వదిలారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టైటిల్ విషయంలో వివాదం మొదలైంది.

కుబేర టైటిల్ వివాదం

కుబేర టైటిల్ మాదేనట్టు నిర్మాత కర్మికొండ నరేంద్ర చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ టైటిల్ ను తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నామని, సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూరయ్యి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే ఈ టైటిల్ డూప్లికేషన్ పై తాము తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినప్పటికీ సమాధానం రాలేదని వెల్లడించారు నరేంద్ర. దీంతో ఈ టైటిల్ వివాదంపై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్టు నిర్మాత నరేంద్ర మీడియాతో తెలిపారు. అయితే అంతకంటే ముందే తెలంగాణ ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరిస్తే బాగుంటుందని, ఇప్పటికే తమ రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ వారు కాపీ కొట్టి రీసెంట్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారని చెప్పుకొచ్చారు నరేంద్ర. ఒకవేళ ఫిలిం ఛాంబర్ ఈ విషయంపై ఇంకా సైలెంట్ గా ఉంటే కుబేర టైటిల్ విషయంలో న్యాయపోరానికి సిద్ధమేనని వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ టైటిల్ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

- Advertisement -

కుబేర షూటింగ్ కు బ్రేక్

ఇక ఇంతకుముందు కూడా కుబేర మూవీ షూటింగ్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది మేకర్స్. కొన్ని రోజుల క్రితం ముందుగానే పర్మిషన్స్ తీసుకొని తిరుపతిలో షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ షూటింగ్ కారణంగా అక్కడ ఎక్కువ మంది గుమిగూడడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అధికారులు మధ్యలోనే ఈ మూవీ షూటింగ్ ను నిలిపివేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు