Thug Life : దుల్కర్ సల్మాన్ ఇన్, ఆ స్టార్ అవుట్… కమల్ ప్రాజెక్ట్ లో ఏంటి ఈ గందరగోళం?

Thug Life : లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ థగ్ లైఫ్. ఈ మూవీలో నటించబోయే నటీనటుల గురించి రోజుకో వార్త తెరపైకి వస్తోంది. నిన్న మొన్నటి దాకా థగ్ లైఫ్ మూవీ నుంచి మలయాళ సార్ హీరో దుల్కర్ సల్మాన్ అర్ధాంతరంగా వైదొలిగాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడని, మరో హీరో ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయ్యాడని తెలుస్తోంది. మరి ఇంతకీ కమల్ హాసన్ ప్రాజెక్ట్ లో ఏం జరుగుతోంది? ఏంటి ఈ గందరగోళం? అనే వివరాల్లోకి వెళితే…

దుల్కర్ ఇన్ ఆ స్టార్ హీరో డ్యూయల్ రోల్…

థగ్ లైఫ్ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ గురించి రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. డేట్స్ ఇష్యూ కారణంగా ముందుగా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. కనీసం సెట్స్ లో అడుగు పెట్టక ముందే ఈ యంగ్ హీరో సినిమాకు గుడ్ బై చెప్పాడని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మళ్లీ దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టాడు. మరో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే దుల్కర్ సల్మాన్ ప్లేస్ ను రీ ప్లేస్ చేస్తున్నాడు అంటూ తమిళ స్టార్ శింబు పేరు వినిపించింది. మరి ఇప్పుడు దుల్కర్ ఈజ్ బ్యాక్ కాబట్టి శింబు అవుట్ అవుతాడా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది.

ఈ ఇద్దరు హీరోలు థగ్ లైఫ్ మూవీలో పార్ట్ కాబోతున్నారట. మరింత ఎగ్జైటింగ్ అప్డేట్ ఏమిటంటే శింబు ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ మూవీ షూటింగ్ సెర్బియాలో రీస్టార్ట్ కాబోతోందని సమాచారం. అక్కడ థగ్ లైఫ్ క్లైమాక్స్ పార్ట్ ను తెరకెక్కించబోతున్నారట మేకర్స్. ఆ క్లైమాక్స్ షూటింగ్ లో కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిషపై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

- Advertisement -

మరి ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నది ఎవరు?

ఇక థగ్ లైఫ్ మూవీలో దుల్కర్ సల్మాన్ తో పాటు శింబు కూడా కీలకపాత్రను పోషించబోతున్నారు. మరి ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్ళబోతున్న మరో స్టార్ హీరో ఎవరు? అంటే మలయాళ స్టార్ జయం రవి. ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన థగ్ లైఫ్ నుంచి జయం రవి తప్పుకుంటున్నారు. ప్రస్తుతం జయం రవి 2 క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జీని, కాదలిక్క నేరమిల్లై అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు జయం రవి. ఈ రెండు సినిమాలు కూడా 2024లో రిలీజ్ కావలసి ఉంది. దీంతో ఫుల్ బిజీగా ఉన్న జయం రవి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారని సమాచారం. మరి ఆయన ప్లేస్ ను ఎవరైనా రీప్లేస్ చేస్తథా? లేదంటే జయం రవి లేకుండానే సినిమా పూర్తవుతుందా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు