Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పులు జరిపిన షూటర్ల అరెస్ట్

Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల ఆదివారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల అనంతరం అక్కడి నుండి పారిపోయారు. బైక్ పై వచ్చిన నిందితులు హెల్మెట్ ధరించారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ముంబై పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు నిందితులను సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని భుజ్ లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ధ్రువీకరించారు. కాల్పుల అనంతరం వీరిద్దరూ ముంబై నుంచి గుజరాత్ పారిపోయారని పోలీసు అధికారులు వివరించారు.

విచారణ కోసం వీరిని ముంబై తీసుకువస్తామని తెలిపారు. నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21) షూటర్లు ఇద్దరూ బీహార్ లోని పశ్చిమ చంపారన్ కి చెందిన వారని పోలీసులు తెలిపారు. గతంలో వీరిద్దరిపై చాలా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితులను విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు