Vishal: “రెడ్ గెయింట్స్ “పై హీరో హాట్ కామెంట్స్..!

Vishal..తెలుగులో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో నటుడు విశాల్ కూడా ఒకరు.. తెలుగు కుర్రాడు అయినప్పటికీ కూడా తమిళంలో ఎక్కువ సినిమాలలో నటించి అక్కడ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. తెలుగులో కూడా ఒక మోస్తారు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే తెలుగులో విశాల్ కు సక్సెస్ అందక ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అవుతోంది.. గత ఏడాది మార్క్ ఆంటోనీ సినిమాతో తమిళంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని కూడా అందుకున్నారు.

Vishal: Hero Vishal hot comments on Red Gaint..
Vishal: Hero Vishal hot comments on Red Gaint..

రెడ్ జాయింట్స్ పిక్చర్ పై విశాల్ ఓపెన్ కామెంట్స్..

తెలుగులో మాత్రం ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా విశాల్ నటిస్తున్న రత్నం సినిమా పైన మంచి నమ్మకంతో వున్నారు విశాల్.. సింగం సిరీస్ తో సూర్యకు మంచి కమర్షియల్ ప్లాట్ఫామ్ అందించిన డైరెక్టర్ హరితో విశాల్ చేతులు కలిపి మరి రత్నం సినిమాని చేస్తున్నారు. ట్రైలర్ రొటీన్ గానే అనిపించినా.. అసలు కంటెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ విశాల్ హామీ ఇస్తున్నారు. ఇటీవలే విశాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెడ్ జాయింట్ ఫిలిమ్స్ పైన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ పై ఓపెన్ కామెంట్స్..

విశాల్ రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కోలీవుడ్లో రెడ్ జాయింట్ ఫిలిమ్స్ ఏక చత్రాధిపతిగా ఏలుతోందని వెల్లడించారు.. ఇది సాక్షాత్తు తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయ నిధి నేతృత్వంలోనే నడుస్తోంది అంటూ విశాల్ వెల్లడించారు. అంతటి బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే ఈ బ్యానర్ ని ఎవరు ఏమి అనలేకపోతున్నారని.. మార్క్ ఆంటోని సినిమా సమయంలో చాలా ఇబ్బందులకు గురి చేసిందంటూ విశాల్ ఓపెన్ గానే మాట్లాడారు.. ఇప్పుడు కూడా ఏప్రిల్ 26న రత్నం సినిమాకు కూడా అడ్డంకులు సృష్టించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ విశాల్ వెల్లడించారు.

- Advertisement -

ఈ సంస్ధ వల్ల దిల్ రాజు కూడా నష్టపోయారు..

రెడ్ జాయింట్ ఫిలిమ్స్ మీద గతంలో కూడా ఇలాంటి ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ ఎవరూ కూడా మీడియా ముందుకు చెప్పడం లేదని విశాల్ తెలియజేశారు.. గత ఏడాది తమిళంలో విడుదలైన విజయ్ దళపతి సినిమా వారసుడు సమయంలో అజిత్ నటించిన తెగింపు సినిమా కూడా విడుదలైంది. ఆ సమయంలో ఎక్కువ థియేటర్లు కూడా తెగింపు సినిమాకి కేటాయించడం వల్ల ఈ విషయంలో దిల్ రాజు కి అన్యాయం జరిగిందని.. చాలా ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని కథనాలు కూడా వినిపించాయి. అక్కడ కూడా కీలకంగా వ్యవహరించింది ఈ రెడ్ జాయింట్ సమస్య అంటూ విశాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

అలా చేసి సమస్యలు సాల్వ్ చేస్తా..

ఈ రెడ్ జాయింట్ ఫిలిమ్స్ తో గొడవలు ఎందుకని ప్రొడ్యూసర్లు సైతం మౌనంగా ఉంటున్నారని.. తాను మాత్రం అలా ఉండలేక ఈ విషయం పైన పోరాడుతూ ఉంటాను అంటూ విశాల్ వెల్లడించారు. అలాగే త్వరలోనే రాజకీయంగా కూడా ఎంట్రీ ఇచ్చి ఇలాంటివి లేకుండా చేస్తానంటూ విశాల్ తెలుపడం జరిగింది. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ కామెంట్లకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు