Devara Part 1 Business : రికార్డ్ ప్రైజ్ కు దేవర పార్ట్ – 1 థియేట్రికల్ రైట్స్..?

Devara: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఓ ముఖ్య అతిథి పాత్రలో నటిస్తున్నారట. రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీనుండి ఇప్పటికే చిన్న గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి భారీ అంచనాలను క్రియేట్ చేసింది యూనిట్. దీంతో ఈ సినిమాని థియేటర్స్ లో ఎప్పుడు చూస్తామో అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై సౌత్ తో పాటు నార్త్ లోను భారీ హైప్ ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను నార్త్ ఇండియాలోని రెండు దిగ్గజ ప్రొడక్షన్ హౌస్ లు ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ అండ్ అనిత్ తందానీకి చెందిన ఏ.ఏ ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు మూవీ టీం ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది.

ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ కి యాజమాని. ఇదే నిర్మాణ సంస్థ బాహుబలి సినిమాని ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత ఘాజి, ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. దేవర పార్ట్ – 1 ఏపీ & నిజాం థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసేందుకు ఓ బడా ప్రొడక్షన్ హౌస్ రూ. 120 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు