Boyapati Srinu : అఖండ2 పై బోయపాటి క్రేజీ అప్డేట్..

Boyapati Srinu : నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ ఫెవరేట్. ఈ కాంబో వస్తుందంటే చాలు హిట్టు పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతుంటారు. ఇప్పటికే వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ చిత్రాలు వచ్చి, ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బాలకృష్ణ కెరీర్ డైలమా లో ఉన్నపుడు సింహ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బోయపాటి, ఆ తర్వాత లెజెండ్ తో అంతకి మించిన హిట్ ఇచ్చాడు. ఇక అన్నిటికి మూడేళ్ళ కింద ఈ కాంబోలో వచ్చిన అఖండ సంచలనాన్ని టాలీవుడ్ అంత త్వరగా మర్చి పోలేదు. కమర్షియల్ డివోషనల్ టచ్ ఇచ్చి, బాలయ్యని అఘోర పాత్రలో బోయపాటి మలచిన తీరు అద్భుతం. దానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. దాదాపు 150 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబోలో మళ్ళీ అఖండ 2 వస్తుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బోయపాటి శ్రీను కూడా పలు ఇంటర్వ్యూ లలో అఖండ 2 ఖచ్చింతంగా ఉంటుందని చెప్పడం జరిగింది.

ఆ పనులు పూర్తి కాగానే బాలయ్య తో సినిమా..

ఇక అఖండ 2 కోసం వెయిట్ చేస్తున్న నందమూరి ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్ ఇచ్చాడు బోయపాటి. నందమూరి బాలకృష్ణ తోనే తన నెక్స్ట్ సినిమా ఖచ్చింతంగా సినిమా ఉంటుందని తాజాగా అప్డేట్ ఇచ్చారు బోయపాటి. అఖండ 2 త్వరలోనే మొదలవుతుందని స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నానని అన్నారు. తాజాగా ఓ గుడి ప్రతిష్టాపన కు వెళ్లిన బోయపాటి బాలయ్య తో సినిమా గురించి మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత తన తదుపరి చిత్రం బాలయ్య తో ఉంటుందని, అప్పుడే అనౌన్స్ చేస్తామని అన్నారు. ఎందుకంటే బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తెలుగు దేశం తరపున ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఊళ్లలో ప్రచారం చేస్తూ బిజీ గా ఉన్నారు. ఆ లోపు బోయపాటి అఖండ 2 కి సంబంధించి స్టోరీ డెవలప్ చేసే పనిలో ఉంటారు.

అఖండ 2 నేపథ్యం ఇదే..

ఇకపోతే అఖండ 2 కథ గురించి కూడా చిన్న హింట్ ఇచ్చాడు బోయపాటి(Boyapati Srinu). అఖండ ఫస్ట్ పార్ట్ పసి బిడ్డ, ప్రకృతి, పరమాత్మ చుట్టూ కథ ఉంటుంది. ఇక అఖండ రెండో పార్ట్ లో ఇప్పటి అఖండ2 సమాజానికి కావాల్సింది ఏంటో అదే ఉంటుందని కంఫర్మ్ చేసారు. బహుశా కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇవ్వొచ్చు అని ఈ మాటల ద్వారా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియచేస్తానని బోయపాటి అన్నారు. ఇక అఖండ సినిమా లో క్లైమాక్స్ పూర్తయ్యాక అఘోర పాత్రలో ఉన్న బాలయ్య ఆ పసిపాప కు మాటిస్తూ, తనని ఎప్పుడు పిలిచినా, తాను ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా క్షణంలో ముందుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక స్టోరీ కూడా అక్కడే మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. రాబోయే కథలో ఆ పాప అమ్మాయి కావచ్చు. ఆ సమయంలో మళ్ళీ ఏదైనా ఆపద వస్తే అక్కడినుంచి కథ సాగొచ్చని అనిపిస్తుంది. మరి బోయపాటి కథను ఎలా సిద్ధం చేస్తున్నాడో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు