RajiniKanth New Movie : రజనీకాంత్ మూవీలో కమల్ హాసన్ కూతురు… ఎవరూ ఊహించన పాత్రలో..

RajiniKanth New Movie : ఇటీవల “జైలర్” సినిమాతో మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇదే ఊపులో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. రజనీకాంత్ నటించే ఈ 171 వ చిత్రాన్ని జైలర్ నిర్మాత కళానిధి మారన్ తన సొంత బ్యానర్ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ సినిమాకి కూడా అనిరుద్ రవిచందరే సంగీతాన్ని అందించబోతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి “కళుగు” అనే టైటిల్ ని నిర్ణయించినట్లు ఓ వార్త మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఈ నెల 22న ఈ మూవీ టైటిల్ ని, అలాగే టీజర్ ని విడుదల చేయనున్నట్లు ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలిపారు. ఇక ఈ మూవీ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ “జై భీమ్” చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తరువాత ఆయన తన 171 వ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ మూవీలో రజనీకాంత్ కూతురిగా కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ నటించనున్నట్లు ఓ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోలీవుడ్ లో సినీ దిగ్గజాలైన కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించి 25 ఏళ్ళు అవుతుంది. ఇక దాదాపు మూడేళ్ల తర్వాత శృతిహాసన్ కి కోలీవుడ్ లో నటించే అవకాశం దక్కింది. అలాంటిది ఇప్పుడు కమల్ హాసన్ కూతురు రజనీకాంత్ తాజా చిత్రంలో ఆయనకు కూతురుగా నటించబోతుండడం విశేషమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు