Boyfriend Loyalty Test : బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడా లేదో ఇలా తెలుసుకోండి

Boyfriend Loyalty Test : ఒక నిర్దిష్ట వయసు తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో పడడం అనేది సర్వసాధారణ విషయం. ప్రతి మనిషికి మానసికంగా కనెక్ట్ అవ్వడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అవసరం ఉంటుంది. వాళ్లనే సోల్ మేట్ అంటారు. ఒకవేళ తను నా కోసమే పుట్టిందేమో అనే ఫీలింగ్ వచ్చింది అంటే వాళ్లతో రిలేషన్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇక యంగ్ గర్ల్స్ తమ లైఫ్ పార్ట్నర్ కోసం చాలా జాగ్రత్తగా వెతుకుతూ ఉంటారు. కానీ లవర్ గా మారే ప్రతి అబ్బాయి ఉద్దేశం లైఫ్ లాంగ్ సదరు అమ్మాయితో కలిసి ఉండటం కాదు. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలతో సరదాగా గడపాలని మాత్రమే కోరుకుంటారు.. అంటే ఆ రిలేషన్ పెళ్లి దాకా వెళ్లదన్నమాట. మరి మీ ప్రియుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే? వాళ్లలో కొన్ని అలవాట్లు ఉన్నాయా లేదా అని గమనిస్తే చాలు.

అతను లవ్ పేరుతో అమ్మాయిల్ని వాడుకుంటున్నాడా? లేదంటే పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఉన్నాడా అనే విషయం బట్టబయలు అయిపోతుంది. ఇప్పుడు కింద ప్రస్తావించబోయే అంశాలు మీ బాయ్ ఫ్రెండ్ లో కనిపించాయంటే అతనికి తన గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనట్టే. మరి ఇంతకీ అలవాట్లు ఏమిటి అంటే?

1. అబద్ధం చెప్పే అలవాటు

మీ బాయ్ ఫ్రెండ్ ప్రతి చిన్న విషయాన్ని దాచిపెడితే లేదా మీతో అబద్ధం చెప్పి మరొకరిని కలవడానికి వెళితే అతను మిమ్మల్ని చీట్ చేస్తున్నాడని అర్థం. అతనికి లైఫ్ లాంగ్ మీతో ఉండాలనే ఆలోచన పొరపాటున కూడా లేదన్నమాట. అలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండటం మంచిది.

- Advertisement -

2. వీటికి దూరంగా ఉంటే…

అమ్మాయిలు సాధారణంగా తాము ఇష్టపడే అబ్బాయిలతో మానసికంగా కనెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తారు. అలాగే అతనితో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటారు. కానీ అబ్బాయి తన ప్రియురాలితో కలిసి సినిమా చూడడం, ట్రిప్ కు వెళ్లడం లేదా కలిసి లంచ్, డిన్నర్ చేయడం వంటి వాటికి దూరంగా ఉంటే అతను తన ప్రియురాలిని వదిలించుకోవాలని కోరుకుంటున్నట్టు.

3. సీక్రెట్స్ మైంటైన్ చెయ్యడం

అమ్మాయిలతో లైఫ్ లాంగ్ ఉండాలనుకునే అబ్బాయిలు కచ్చితంగా తమ రిలేషన్ గురించి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్తారు. కానీ ఒక అబ్బాయి తన రిలేషన్ గురించి సీక్రెట్ గా ఉంచుతున్నా, సోషల్ మీడియాలో తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకోకుండా ఉన్నా అతను ఫ్యూచర్ లో ఆ అమ్మాయిని మోసం చేసే ఆలోచనలో ఉన్నట్టే.

4. శారీరక సాన్నిహిత్యం మాత్రమే కావాలా?

ఎవరైనా ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నప్పుడు ఎమోషనల్ అండ్ ఫిజికల్ కనెక్షన్ కి స్కోప్ ఉంటుంది. కానీ బాయ్ ఫ్రెండ్ కేవలం శారీరక సాహిత్యాన్ని మాత్రమే కోరుకుంటే అతను మిమ్మల్ని వాడుకుంటున్నాడని అర్థం. అలాంటి వ్యక్తి వల్ల ఫ్యూచర్ లో బాధపడాల్సి వస్తుంది. ఈ నాలుగు లక్షణాలు ఉండే అబ్బాయి ప్రేమ పేరుతో అమ్మాయిని వాడుకుంటాడు తప్ప పెళ్లి చేసుకోడు. మీరు గనక ఇలాంటి అబ్బాయితో రిలేషన్ లో ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు