Lifestyle: రాత్రి భోజనం చేశాక ఆ ఒక్క పని చేస్తే తీవ్రమైన వ్యాధులన్నీ దూరం

Lifestyle : నేటి బిజీ లైఫ్ లో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. పని, బిజీ, ఒత్తిడి కారణంగా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండే విషయంలో చాలా వెనకబడిపోతున్నారు. అయితే ఉద్యోగం చేయడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యమైనే విషయాన్ని మర్చిపోతున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ నేపథ్యంలోనే కొంత మంది మాత్రం ఫిట్నెస్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. తమను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి హెల్ది ఫుడ్ తీసుకోవడంతో పాటు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యాయామం చేసే సమయం.

శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి చాలా మంది జిమ్ కి వెళ్ళాలి లేదా యోగా, ఇతర వ్యాయమాలు చేయాలని, కానీ దానికి తమ దగ్గర పెద్దగా సమయం ఉండదని ఆలోచిస్తారు. కానీ ఇలాంటి వారు రాత్రి పూట ఆహారం తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేస్తే చాలు ఫిట్ గా ఉండొచ్చు. రాత్రి పూట 15 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఎన్నో తీవ్రమైన వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. మరి భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జీర్ణ వ్యవస్థకు మేలు

రాత్రి పూట తిన్న వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి. భోజనం పూర్తయ్యాక కాసేపు అలా నడవడం వల్ల జీర్ణ వ్యవస్థ హెల్దిగా ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి ఈ వాకింగ్ బాగా హెల్ప్ అవుతుంది.

- Advertisement -

2. ఇన్ని రోగాలు దూరం

ఇలా తినగానే 15 నిమిషాల పాటు నడవడం వల్ల పెప్టిక్ అల్సర్, మూడ్ స్వింగ్స్, డైవర్టిక్యులర్ డిసీజ, మలబద్ధకం, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమయిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

3. షుగర్ అదుపులో

అంతేకాదు ఆహారం తిన్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. టైప్ 1 అండ్ టైప్ – 2 డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్ గా తినగానే కనీసం 10 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.

4. గుండె జబ్బులు రావు

తిన్న వెంటనే నడిచే అలవాటు ఉన్న వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది.

5. మంచి నిద్ర

తినగానే ఐదు నుంచి పది నిమిషాల పాటు నడిస్తే బాగా నిద్ర పడుతుంది. మరి ఇలా నడవడానికి సరైన సమయం ఏమిటి? అంటే లంచ్ లేదా డిన్నర్ తర్వాత కాసేపు నడవాలి. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే లైఫ్ లాంగ్ హెల్దిగా ఉంటారు.

కాబట్టి రోజంతా పని చేసి చేసి అలసిపోయాము అనే సాకును పక్కన పెట్టేసి ఈ అలవాటును అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేయండి. తినగానే నడుం వాల్చకుండా కాళ్ళకు పని చెప్పి ఆరోగ్యంగా-, ఫిట్ గా ఉండండి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు