Dwarakish: సినీ పరిశ్రమలో విషాదం.. ఎన్టీఆర్ అవార్డు గ్రహీత కన్నుమూత

Dwarakish: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత బంగల్ శామరావు ద్వారకీష్ (81) కన్నుమూశారు. 1942 ఆగస్టు 19లో జన్మించిన ద్వారకీష్ మైసూర్ లోని ఇట్టిగేగూడలో జన్మించారు. మొదట ఆయన తన సోదరునితో కలిసి మైసూరులోని గాంధీ స్క్వేర్ లో భారత్ ఆటో స్పేర్స్ ని స్థాపించారు. అలా వ్యాపార రంగంలోకి ప్రవేశించి విజయం సాధించినప్పటికీ.. ఆయనకి నటనపై ఎక్కువగా ఆసక్తి ఉండేది.

అలా 1963 లో వ్యాపార ప్రపంచాన్ని విడిచి చలనచిత్ర వృత్తిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుని ఆ వైపుగా అడుగులు వేశారు. నటుడిగా ఆయుష్మాన్ భవ, ఆప్తమిత్ర విష్ణువర్ధన వంటి ఎన్నో విజయాలు సాధించి.. దర్శకుడిగా, నిర్మాతగా సైతం మారారు. 81 ఏళ్ల వయసు ఉన్న ఆయన మరణంతో పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆయన గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు