Venuswamy: ఉపాసన పై షాకింగ్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్..!

Venuswamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సినీ సెలెబ్రెటీల జాతకాలపై నోరు విప్పుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ఈయన చెప్పే జాతకం నిజమైతే. మరొకసారి బొక్క బోర్ల పడతారు అనడంలో సందేహం లేదు. అలా జాతకాలు తప్పిన సమయంలో నెటిజన్స్ , అభిమానుల నుంచి పూర్తిస్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇదిలా ఉండగా వేణు స్వామి ఇప్పుడు సెలబ్రిటీలనే కాదు వారి బంధువులు, లైఫ్ పార్ట్నర్స్ విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ చేస్తున్న కామెంట్స్ అటు అభిమానులకు కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనపై వేణు స్వామి చేసిన కామెంట్లు అభిమానులలోనే కాదు సినీ సెలబ్రిటీలలో కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరి ఉపాసన గురించి వేణు స్వామి చేసిన కామెంట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Venuswamy: Venuswamy comments about Upasana..!
Venuswamy: Venuswamy comments about Upasana..!

ఉపాసన పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..

ఉపాసన గురించి వేణు స్వామి ఊహించని కామెంట్స్ చేశారు.. ఉపాసన రెండో బిడ్డ విషయంలో కామెంట్లు చేయడంతోనే అందరికీ కోపాన్ని తెప్పిస్తోంది.. అసలు విషయంలోకి వెళ్తే ఉపాసన రెండవ బిడ్డను కనడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆమె మాట్లాడుతూ..” నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అని అనుకున్నాను.. అందుకే పదేళ్ల తర్వాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా సరే పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయాలని అనుకోవడం లేదు. దేవుడు వరమిస్తే తప్పకుండా రెండో బిడ్డకి తల్లిని అవుతాను ” అంటూ ఆమె తెలిపింది. కానీ వేణు స్వామి దీనికి దీటుగా ఉపాసనకు ఇక పిల్లలు పుట్టరని చెప్పి షాక్ ఇచ్చారు. దీంతో అటు అభిమానులు , ఇటు సెలబ్రిటీలు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

క్లీంకారా వల్లే సక్సెస్..

క్లీంకారా జాతకం పై వేణు స్వామి మాట్లాడుతూ.. ఆమెది తిరుగులేని జాతకం.. అనేక విజయాలు సాధించి మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. సాధారణంగా పిల్లల జాతకాలు బయటకు చెప్పకూడదు.. ముఖ్యంగా బాలారిష్టం ఉన్న పిల్లల జాతకాలు అస్సలు చెప్పకూడదు ..ఒకవేళ అలా చెబితే వారికి ఉండే గండాల గురించి కూడా చెప్పాలి.. అందుకే చాలామంది పండితులు పిల్లల జాతకాలు చెప్పరు..ఇక అన్నీ బాగున్న పిల్లల జాతకాలు నిర్మొహమాటంగా బయటికి చెప్పవచ్చు అంటూ వేణు స్వామి తెలిపారు. మొత్తానికైతే క్లీంకార వల్లే ఉపాసన, రాంచరణ్ తో పాటు చిరంజీవి కూడా సక్సెస్ అవుతున్నారని పరోక్షంగా వెల్లడించారు వేణు స్వామి.. ఇక ప్రస్తుతం మెగా కుటుంబంపై చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

- Advertisement -

రామ్ చరణ్ కెరియర్..

ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకోవడమే కాదు ఇటీవల డాక్టరేట్ కూడా సొంతం చేసుకున్నారు. అంతే కాదు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న ఈయన .. ఈ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా.. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు