Gopichand: భారీ బడ్జెట్ తో గోపీచంద్ విశ్వం మూవీ.. ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదు..

Viswam movie business: మాచో స్టార్ గోపీచంద్ చాలాకాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొంతకాలంగా గోపీచంద్ కెరీర్ పరిస్థితి పెద్ద గొప్పగా లేదని చెప్పుకోవచ్చు. వచ్చిన సినిమా వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోతుంది. చివరిగా “భీమా” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు గోపీచంద్. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు గోపీచంద్. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో “విశ్వం” అనే చిత్రం చేస్తున్నాడు.

ఈ యాక్షన్ డ్రామాతో ఈసారి బిగ్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీని ఆల్మోస్ట్ 32 – 35 కోట్ల రేంజ్ లో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఇప్పటికే ఓవర్ బడ్జెట్ కావడంతో ఫైనాన్షియల్ సమస్యల్లో ఉన్నట్టు సమాచారం.

సినిమాకి ఓవర్ బడ్జెట్ కావడం, గోపీచంద్ సినిమాల మార్కెట్ డ్రాష్ అవ్వడం, శాటిలైట్, ఓటిటి రైట్స్ తగ్గిపోవడం వల్ల విశ్వం సినిమా ఇబ్బందుల్లో పడినట్లు వినిపిస్తోంది. ఈ సమయంలో విశ్వం హిందీ రైట్స్ మంచి మొత్తానికే వెళ్లాయనే వార్త ఇప్పుడు అభిమానులకు కాస్త ఆనందం కలిగిస్తోంది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ 12 కోట్ల రూపాయలకు వెళ్లినట్లు సమాచారం.

- Advertisement -

ఈ చిన్న సినిమాకి బాలీవుడ్ లో మంచి హైప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ వీడియో చాలా స్టైలిష్ అండ్ రిచ్ గా ఉంది. దాంతో సినిమాపై అభిమానులలో ఆసక్తి నెలకొంది. చైతన్ భరద్వాజ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ ఓ మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు