Raviteja: తండ్రి కోసం అలాంటి పని చేసిన కూతురు.. ఫొటోస్ వైరల్!

Raviteja..తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు.. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవితేజ.. ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లలో కూడా నటించారు. ఆ తర్వాత హీరోగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పరుచుకున్నారు. రవితేజ ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలతో.. పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో ప్రేక్షకులను అలరించిన రవితేజ.. తాజాగా బిజినెస్ వైపుగా కూడా అడుగులు వేశారు.

Raviteja:The daughter did such a thing for her father.. Photos went viral!
Raviteja:The daughter did such a thing for her father.. Photos went viral!

బిజినెస్ రంగంలోకి రవితేజ..

ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు, మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.. ఇకపోతే సౌత్ లో మల్టీప్లెక్స్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంది.. ఇలాంటి వాటిలో ఏషియన్ సినిమా సంస్థ బాగానే దూసుకుపోతోంది.. ఈ సంస్థ బిజినెస్ లలో చాలామంది స్టార్ హీరోలు కూడా భాగం అయ్యారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరిట AMB అనే మల్టీప్లెక్స్ స్థాపించగా.. అల్లు అర్జున్ AAA పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలుపెట్టారు. అలాగే విజయ్ దేవరకొండ కూడా AVD అనే పేరుతో మల్టీప్లెక్స్ స్థాపించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రవితేజ కూడా వీరి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సంస్థతో చేతులు కలిపి రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం.

దిల్ షుఖ్ నగర్ లో భారీ మల్టీప్లెక్స్..

రవితేజ దిల్ షుఖ్ ఒక భారీ మల్టీప్లెక్స్ ను స్థాపిస్తున్నారు.. అయితే ఇందుకు గాను ART అనే పేరుతో ఈ మల్టీప్లెక్స్ ను మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది రీసెంట్గా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరిగాయి.. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న తరుణంలో రవితేజ కూతురు మోక్షదా.. ఈ కార్యక్రమంలో పాల్గొనింది. ఇక తండ్రి బిజినెస్ రంగంలో సక్సెస్ కావాలి అని కొబ్బరికాయ కొట్టి మరి మల్టీప్లెక్స్ ప్రారంభించింది మోక్షదా. ఈమెను చూసిన అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ..సింపుల్ లుక్స్ తో కనిపించిన మోక్షధ అందరిని ఆకట్టుకుంటోంది. త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. మరి మల్టీప్లెక్స్ బిజినెస్ లో రవితేజ సక్సెస్ కావాలని అభిమానులైతే కోరుకుంటున్నారు.

- Advertisement -

రవితేజ సినిమాలు..

ప్రస్తుతం రవితేజ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తన 75 వ సినిమాని డైరెక్టర్ భాను బొగ్గువరపు దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించబోతున్నారు. రవితేజ ఏడాదికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు సినిమాలు విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తూ విడుదల చేస్తుంటారు. చివరిగా ఈగల్ సినిమాతో రవితేజ మరో మంచి విజయాన్ని అందుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు