Robinhood: నితిన్ “రాబిన్‌హుడ్‌” లో రాశి ఖన్నా

Robinhood: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరిలో నితిన్ ఒకరు. నితిన్ తన ప్రతీ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాంటి నితిన్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. ఇటీవల ఆయన సినిమాలు ఏవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అప్పుడప్పుడు భీష్మ సినిమాతో తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ కి ఇప్పటివరకు సరైన హిట్ లభించలేదు.

ఆ మధ్య వచ్చిన మాస్ట్రో కాస్త పరవాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే “రాబిన్ హుడ్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు నితిన్. భీష్మ సినిమాతో తనకి మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలోనే మరోసారి నితిన్ చేస్తున్న చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హ్యూమరస్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో నితిన్ ఓ దొంగగా కనిపించనున్నారు.

ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. ఇక ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ మూవీలో రాశి ఖన్నాని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ రోల్ పై త్వరలోనే మేకర్స్ నుండి ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు