Family Star OTT Release Date : ఓటీటీలోకి అనుకున్న దాని కంటే ముందుగానే ఫ్యామిలీ స్టార్

Family Star OTT Release Date : ఎన్నో అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఫ్యామిలీ స్టార్ మూవీ. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ టైంలో నిర్మాత నాగ వంశీ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అంటూ చాలా హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కానీ, ఆ ప్రయత్నాలు ఏవీ కూడా సక్సెస్ అవ్వలేదు. సినిమా మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. తర్వాత కొంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయినా, సినిమాకు నష్టాల నుంచి కాపాడే అంత వరకు అయితే జరగలేదు. కాగా, ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత చాలా మంది థియేటర్స్ కి వెళ్లలేదు. ఎలాగు నాలుగు వారాల్లో సినిమా ఓటీటీలోకి వచ్చే చాన్స్ ఉంది కదా అని సైలెంట్ అయిపోయారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.

ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లకు ఇచ్చారు. థియేటర్ లో రిలీజ్ అయ్యాకా… నాలుగు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యేలా అమెజాన్ ప్రైమ్ వీడియో – నిర్మాత నాగ వంశీ మధ్య ఒప్పందం జరిగింది. కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ను ఆడియన్స్ థియేటర్ కి వచ్చి చూసే అంతా ఓపిక ఆడియన్స్ కు లేదు.

- Advertisement -

దీంతో నిర్మాత నాగ వంశీ ముందు అమెజాన్ ఓ ఆఫర్ పెట్టిందట. అనుకున్న దాని కంటే కొంత వరకు డబ్బులు ఎక్కువ ఇచ్చి, నాలుగు వారాల కంటే ముందుగానే ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అందుకు నాగ వంశీతో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే, ఫ్యామిలీ స్టార్ మూవీ ముందుగానే ఓటీటీలోకి రావొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు