Thandel OTT Rights : భారీ ధరకు అమ్ముడైన తండేల్ ఓటిటి రైట్స్… నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్

Thandel OTT Rights : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న కొత్త మూవీ తండేల్. ఈ మూవీలో నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను రికార్డు ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందని సమాచారం. మరి ఇంతకీ ఏ ఓటిటి చేతికి తండేల్ రైట్స్ దక్కాయి? ఈ మూవీ డిజిటల్ డీల్ ఎన్ని కోట్లకు జరిగింది? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

చై కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్..

తండేల్ మూవీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా 40 కోట్లకు అమ్ముడు కావడం విశేషం. నాగ చైతన్య కెరీర్ లోనే ఆయన మూవీకి ఇన్ని కోట్ల డీల్ రావడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. తండేల్ మూవీ నాగ చైతన్య కెరీర్ లోనే రికార్డు ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడైన మూవీగా నిలిచింది.

అతనే కారణమా?

మరి నాగ చైతన్యకి వరుస డిజాస్టర్లు ఉన్నప్పటికీ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడు కావడానికి కారణం ఏంటి? అంటే తండేల్ మూవీకి దర్శకత్వం వహిస్తున్న చందూ మొండేటి గత చిత్రం అని టాక్ వినిపిస్తోంది. కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ చందూ మొండేటి. ఇక ఆయన దర్శకత్వంలోనే రూపొందుతున్న తండేల్ మూవీ ఇప్పటికే టీజర్ వంటి ప్రమోషన్ కంటెంట్ తో అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీ డిజిటల్ డీల్ ఈ రేంజ్ లో క్లోజ్ కావడానికి డైరెక్టర్ కూడా ఒక రీజన్ అని అంటున్నారు.

- Advertisement -

షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే?

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండేల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. దేశభక్తి, లవ్ వంటి అంశాలను కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చేపల వేటకు వెళ్లిన కొందరు జాలర్ల రియల్ లైఫ్ స్టోరీతో వస్తోంది. పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అయిన జాలర్లు అక్కడి పోలీసుల చేతికి చిక్కడం, అనంతరం వాళ్ళు చిత్రహింసలు భరించడం వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు చందూ మొండేటి. ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటు సాయి పల్లవి కూడా డి గ్లామర్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే నాగ చైతన్య ఈ మూవీలో ఫస్ట్ టైం శ్రీకాకుళం యాసలో మాట్లాడబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

నాగచైతన్య హీరోగా నటించిన గత సినిమాల నాన్ థియేటర్ రైట్స్ చూస్తే… బ్లాక్ బస్టర్ మూవీ లవ్ స్టోరీ నాన్ థియేట్రికల్ రైట్ 16 కోట్లకు అమ్ముడయ్యాయి. హిందీ డబ్బింగ్ రైట్స్, సాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అన్ని కలుపుకొని ఈ మూవీ రైట్స్ ను ఆహా కొనుగోలు చేసింది. నాగచైతన్య సినిమాల్లో అదే పెద్ద డీల్ అనుకుంటే తాజాగా తండేల్ మూవీకి రికార్డు స్థాయిలో డిజిటల్ డీల్ జరగడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు