Jyothika : ఎవరెస్ట్ అధిరోహించిన తొలి హీరోయిన్… ?

Jyothika : ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు అంటూ ఇప్పటికే చాలామంది వ్యక్తులు నిరూపించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు సెలబ్రిటీలు కూడా అరుదైన ఘనతలు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు.. అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ గా, నిర్మాతగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక ఇప్పుడు అరుదైన ఘనత అందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది..? మరి జ్యోతిక ఎటువంటి ఘనత సాధించడానికి.. ఏ విధమైన ప్రయత్నం చేస్తోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ..

ఫిట్నెస్ మెయింటైన్ చేసే విషయంలో కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందుకే మంచి వయసులో సాధ్యం కానివి వయసు ముదిరిన సమయంలో చేస్తూ రికార్డు సృష్టిస్తూ ఉంటారు.. ఇకపోతే వర్క్ అవుట్ లాంటి వాటితో బాడీని మంచి షేప్ లో వుంచుతున్నారు. ఇలాంటి వారిలో జ్యోతిక కూడా ఒకరు.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అద్భుతమైన మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏ హీరోయిన్ కి సాధ్యం కానిది చేయడానికి రెడీ అయిపోయింది.. మరి ఆ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది

ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే పనిలో పడ్డ జ్యోతిక..

గతంలో హిమాలయాలు , కశ్మీర్లో ట్రెక్కింగ్ చేస్తూ కనిపించిన జ్యోతిక ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే బిజీలో ఉంది.. ప్రస్తుతం బేస్ క్యాంపు వరకు వెళ్లిన విషయాన్ని తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. అక్కడి వరకు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాను.. ఏమేం తిన్నాను.. అక్కడ వాతావరణం ఎలా ఉంది.. అలాంటి విజువల్స్ ని రీల్ చేసి పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఒకవేళ జ్యోతిక గనుక ఎవరెస్టు ఎక్కితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ అయిపోతుందనటంలో సందేహం లేదు. భారీగా ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తన ప్రయత్నము ఫలించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు..

- Advertisement -

జ్యోతిక కెరియర్..

జ్యోతిక కెరియర్ విషయానికి వస్తే.. ముంబైకి చెందిన ఈమె దాదాపు 20 ఏళ్ల క్రితమే తెలుగు , తమిళ్ భాషలో వరుస సినిమాలు చేసి భారీ క్రేజ్ దక్కించుకుంది.. ఆ తర్వాత కోలీవుడ్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నటన పక్కన పెట్టేసి నిర్మాతగా మారింది.. పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు నిర్మాతగా తన వృత్తిని కొనసాగిస్తూనే హీరోయిన్గా కూడా మంచి దూకుడు చూపిస్తోంది.. ప్రస్తుతం భర్త , పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్న ఈమె ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. మొన్నా మధ్య భర్త సూర్యతో పోటీపడుతూ జిమ్లో వర్కౌట్లు చేస్తూ అందరిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తూ.. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఏదేమైనా జ్యోతిక చేస్తున్న ప్రయత్నం ఫలించాలని అటు అభిమానులే కాదు ఇటు సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు.. మరి ఏ మేరకు జ్యోతిక ఈ ఘనతను సాధిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు