Lavanya tripathi: లావణ్య చెత్త పని.. ‘అత్తమ్మాస్’ పై మరక..!

Lavanya tripathi.. మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బిజినెస్ వైపుగా అడుగులు వేస్తున్నారు.. గడిచిన కొద్దిరోజుల క్రితం మెగా కోడలు ఉపాసన, ఈమె అత్తగారు సురేఖ తో ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా అత్తమ్మాస్ కిచెన్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఉన్నది.. ముఖ్యంగా ప్రోడక్ట్లకు సంబంధించి పలు రకాల వీడియోలను, ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉండేది ఉపాసన.. ఉపాసన తన అత్త సురేఖ, అంజనమ్మ ముగ్గురు కలిసి అత్తమ్మాస్ కిచెన్ అంటూ బిజినెస్ మొదలుపెట్టారు.. ఇందులో కేవలం తమ వంటింటి రుచులను అందరికీ పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ బిజినెస్ ని మొదలుపెట్టారు.. ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం, వర్కింగ్ ఉమెన్స్ కోసం.. ఇన్స్టంట్ పొడులను తయారు చేసి చాలా తక్కువ ధరకే సేల్ చేస్తున్నారు.

అత్తమ్మాస్ కిచెన్..

అయితే ఈ ప్రొడక్ట్ లను ఎంత హైజెనిక్ గా తయారు చేస్తున్నారో కూడా చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టా ఖాతా నుంచి ఒక పోస్టు వైరల్ గా మారింది.. అందులో లావణ్య త్రిపాటి , నాగబాబు భార్య పద్మ కనిపించారు.. అయితే వారు ఆవకాయను తయారు చేసే విధానాన్ని ఇందులో చూపించారు.. కేవలం ఆవకాయను కలుపుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఫోటో మీద కొంతమంది చాలా అభ్యంతరాన్ని కూడా తెలియజేస్తున్నారు. వాటి గురించి చూద్దాం.

అలాంటి పోస్ట్ పెట్టి విమర్శలు ఎదుర్కొన్న లావణ్య..

Lavanya tripathi: Lavanya's worst work.. stain on 'Atthammas'..!
Lavanya tripathi: Lavanya’s worst work.. stain on ‘Atthammas’..!

లావణ్య త్రిపాఠి ఆమె అత్త పద్మ చేసిన ఈ పోస్ట్ పైన వీరు చేసే ఆవకాయ నాణ్యత లేదంటూ తెలియజేస్తున్నారు.. పైగా లావణ్య జుట్టు వదిలేసుకొని.. చేతులకు గ్లౌజు వేసుకోకుండా ఏమాత్రం హైజానిక్ మెయింటైన్ చేయడం లేదంటూ కూడా పలువురు నెటిజెన్స్ విమర్శిస్తున్నారు.. అయితే ఈ విషయం పైన అత్తమ్మాస్ కిచెన్ టీం తన ఇన్స్టా లో స్పందిస్తూ..ఈ పోస్ట్ పై కామెంట్స్ చేసిన వారికి రిప్లైలు ఇచ్చింది.. అయితే అది అత్తమ్మాస్ కిచెన్ కోసం కాదని.. ఇంటి కోసం చేస్తున్నది కాబట్టే అలా కనిపించారు అంటూ అత్తమ్మాస్ కిచెన్ కోసం చేసేటప్పుడు ఎంతో హైజినిక్ గానే మెయింటైన్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు..

- Advertisement -

హైజినిక్ పై క్లారిటీ ఇచ్చిన అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టా..

ఇలా అత్తమ్మాస్ కిచెన్ పేజీలో పోస్ట్ పెట్టి స్టాక్ లిమిటెడ్ అని చెబితే అందరూ అలాగే అనుకుంటారేమో అన్నట్లుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.. మరి హైజినిక్ గానే తయారు చేస్తామని చెప్పినా.. అలాగే చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటూ క్లారిటీ ఇచ్చింది అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టా..

లావణ్య త్రిపాఠి సినిమాలు..

ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. హ్యాపీ బర్తడే సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ సినిమా కథ కోసం ఎదురు చూస్తున్న ఈమె ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.. మొత్తానికైతే సినిమా కథల ఎంపిక విషయంలో ఏమి ఆలోచిస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు