Venkat Prabhu : కూలీని మధ్యలోకి లాగుతూ లోకేష్ కనగరాజ్ పై మరో డైరెక్టర్ సెటైర్

Venkat Prabhu : కోలీవుడ్ లో ప్రస్తుతం ఇద్దరు దర్శకుల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ చర్చనీయాంశంగా మారింది. వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ కొత్త చిత్రం కూలీని ప్రస్తావిస్తూ ఆ మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మీద సెటైర్లు వేశాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది ? అంటే..

కూలీ టైటిల్ టీజర్ రొటీన్..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 171వ చిత్రం టైటిల్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కూలీ అనే టైటిల్ పెట్టారు. లోకేష్ కనగరాజ్ తన ప్రతి సినిమా టైటిల్‌ను విడివిడిగా ప్రోమో వీడియోల ద్వారా విడుదల చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్‌, విజయ్ హీరోగా చేసిన లియో, రజనీకాంత్ కూలి అనే మూడు చిత్రాల కోసం ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యాడు. తాజాగా విడుదలైన రజనీ కూలీ టైటిల్ వీడియో విక్రమ్, లియో టైటిల్ వీడియోల మాదిరిగానే ఉందని సూపర్ స్టార్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కూలీ టైటిల్ వీడియో మిగతా రెండు సినిమాల టైటిల్ వీడియోల అంత బాగా లేదని కొందరు అంటున్నారు.

కూలీ టిజర్ పై నటుడి విమర్శలు

ఈ నేపథ్యంలోనే నటుడు కార్తీక్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందరు స్టార్ల సినిమాల టీజర్లు ఒకేలా ఉంటాయని, హీరో రాకను ఈ టీజర్లలో ఒకే విధంగా బిల్డప్ ఇస్తున్నారని ఆ వీడియోలో చెప్పాడు. అయితే ఇలాంటి టీజర్ విడుదలైన ప్రతిసారీ వీడియో బాగుందని అభిమానులుగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని ఆయన అన్నారు.

- Advertisement -

వెంకట్ ప్రభు సెటైర్లు..

కార్తీక్ కుమార్ షేర్ చేసిన ఈ వీడియోని దర్శకుడు వెంకట్ ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తూ వ్యంగ్యంగా నవ్వుతున్నట్టుగా ఉన్న ఏమోజీలను పోస్ట్ చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు తన పోస్ట్ పై వివరణ ఇచ్చారు. ‘‘ఈ వీడియోలో ఆయన చెప్పింది నిజమే. కమర్షియల్ సినిమాలు తీసే మనలాంటి వాళ్ల గురించి అతను మాట్లాడుతున్నాడు. అయితే మనం ఏదైనా డిఫరెంట్‌గా ప్రయత్నిస్తే, అభిమానులు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అని వెంకట్ ప్రభు సమాధానమిచ్చారు. దీంతో ఆయన తాను ముందు చేసిన పోస్ట్ ను కవర్ చేస్తూ మళ్ళీ అభిమానుల వైపే వేలెత్తి చూపించడం గమనార్హం. ఈ విషయం గురించి లోకేష్ ఇంకా స్పందించలేదు.

అట్లీతో కూడా సమస్య…

ఇక డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్టర్ లపై ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అట్లీ తీసిన మెర్సల్ గురించి ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. అందులో అట్లీ మెర్సల్ చిత్రాన్ని బాగా అడాప్ట్ చేసుకున్నాడని  పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం వెంకట్ ప్రభు దలపతి విజయ్ తో ది గోట్ మూవీని తీస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు