Star Hero: భార్య చేతిలో చెంప దెబ్బ తిన్న స్టార్ హీరో..కారణం..?

Star Hero.. జీవితం ఒక చదరంగం లాంటిది.. సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా అందులో చిక్కుకోక తప్పదు. ఎవరికి ఉండే బాధలు వారికి.. అయితే ఈ చదరంగంలో సినిమా వాళ్ళేమి మినహాయింపు కాదు.. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఒకరనే చెప్పాలి.. ఆయన ఈ సంసారం అనే చదరంగంలో పడి చివరికి భార్యతో చెంప దెబ్బలు కూడా తిన్నారట. అమీర్ ఖాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రయోగాత్మక సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సృష్టికర్త అయిన అమీర్ ఖాన్ కథనే హీరోగా చూపించి.. ఆయన చేసిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించాయి.కథ బలంగా ఉంటే సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అని నమ్మే అతికొద్దిమంది వ్యక్తులలో అమీర్ ఖాన్ మొదటి వరుసలో ఉంటారు. ఇక చివరిసారిగా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించారు. ఈ సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈయన చెన్నైలో ఉంటున్నారు.. అక్కడే హిల్స్ స్టేషన్లో సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

Star Hero: Star Hero who was slapped on the cheek by his wife..the reason..?
Star Hero: Star Hero who was slapped on the cheek by his wife..the reason..?

నా మాజీ భార్య చంప దెబ్బ కొట్టింది..

ఏదైనా సరే మనసులో దాచుకోకుండా బయటకి చెప్పే అమీర్ ఖాన్ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా దాచుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా హిందీ బుల్లితెరపై ఫేమస్ రియాల్టీ షో అయిన “ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ” షోలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా అమీర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలు, కెరియర్ ,సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నారు.. ఇందులో భాగంగానే తన ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన సీక్రెట్ ని వెల్లడించారు.. అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. నా మాజీ భార్య రీనా దత్త నన్ను చెంప దెబ్బ కొట్టింది.. అలాగే చేతిని గట్టిగా పళ్ళతో కొరికి తిట్టింది అంటూ చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్..

కొట్టడానికి కూడా కారణం ఉంది..

నాతో ఇలా ప్రవర్తించడానికి కూడా ఒక కారణం ఉంది. నా పెద్ద కొడుకు జునైద్ ఖాన్ పుట్టే సమయంలో రీనా ప్రసవ వేదన భరించలేకపోయింది. ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లి నేను పక్కనే ఉన్నాను.. ఇక ఆమె బాధతో అల్లాడిపోతోంది .. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు.. ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించాను.. ఊపిరి తీసుకో.. రిలాక్స్ గా ఉంటుందన్నారు.. వెంటనే తనకు కోపం వచ్చి గట్టిగా చంప దెబ్బ కొట్టింది.. అంతేకాదు నా చేతిని తీసుకొని గట్టిగా కొరికింది కూడా.. అంతలా బాధలో ఉన్నప్పుడు నేను మాట్లాడిన మాటలు సిల్లీగా అనిపించి.. తాను అలా చేసి ఉంటుంది.. వెంటనే ఈ అర్థం లేని మాటలు ఆపు అంటూ నాపై అరిచింది.. మొదటిసారి నేను ఆమె బాధని చూసాను.. బిడ్డ పుట్టినప్పుడు ఆడవారు అనుభవించే బాధను మొదటిసారి దగ్గరుండి చూసాను.. అంత బాధను తట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు.. ప్రసవ సమయంలో ఆమె పడిన బాధ ఆమె ముఖంపై చూశాను.. ఇప్పటికీ నేను మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్.. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు