Prabhas: ఆ ముగ్గురితో ఎఫైర్.. నిజమేనా? అయితే వారెవరు..?

Prabhas..టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే… టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు పొందిన ప్రభాస్.. ఈయన అభిమానులు మాత్రం ఈయన పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో హీరో ప్రభాస్ చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో నిజం ఎంతుంది? ఆ హీరోయిన్స్ ఎవరు..? వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Prabhas: The affair with those three... is it true? But who are they?
Prabhas: The affair with those three… is it true? But who are they?

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదిస్తూ భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఎక్కువగా కెరియర్ పైనే పెట్టారు ప్రభాస్. అందుకే ఎలాంటి రూమర్స్ విషయం పైన కూడా పెద్దగా స్పందించరు. తన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఒకే రకంగానే ఉంటారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 సంవత్సరాలు.. ఎంతమంది తన పెళ్లి ఎప్పుడు అని ఎన్నోసార్లు అడిగినప్పటికీ ఆ విషయాన్ని దాటేస్తూ ఉంటారు ప్రభాస్. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పైన ఎప్పుడూ కూడా ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి.

త్రిష తో ప్రభాస్ ఎఫైర్..

త్రిష , ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన వర్షం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ పలు రకాల వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరూ పౌర్ణమి సినిమాలో కూడా నటించడంతో ఆ సినిమాలో కెమిస్ట్రీ కూడా అందుకు కారణమైంది. మళ్లీ బుజ్జిగాడు సినిమాలో నటించడంతో ఈ వార్తలు మరింత ఎక్కువగా వినిపించాయి. అయితే ఇందులో నిజం లేదని మాత్రం తేలిపోయింది.

- Advertisement -

అనుష్క తో ఎఫైర్..

ఆ తర్వాత మరొక హీరోయిన్ అనుష్క.. ప్రభాస్, అనుష్క పెళ్లి చూడాలని అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఉన్నారు.. కానీ వీరు మాత్రం కేవలం తామిద్దరం స్నేహితులమే అంటూ తెలియజేశారు. అయితే త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు రకాల ఫోటోలను చాలామంది అభిమానులు తెగ వైరల్ గా చేశారు. విచిత్రం ఏమిటంటే వీరిద్దరి వయసు 40 ఏళ్లు దాటిన వీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు.

కృతిసనన్ తో ఎఫైర్..

మరో హీరోయిన్ కృతి సనన్.. తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈ అమ్మడు సరైన అవకాశాలు లేక.. సక్సెస్ రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్ళింది.. అక్కడ పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగిన కృతిసనన్.. ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించడంతో సీత పాత్ర లో అద్భుతంగా ఉందని.. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య క్లోజ్ నెస్ చూసి పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి. అయితే ఈ విషయాన్ని కృతి సనన్ మాత్రం ఖండించింది.

ప్రభాస్ సినిమాలు..

ఇలా ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ ప్రభాస్ మాత్రం ఈ విషయాలను లెక్కచేయకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే కల్కి సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధమయ్యింది.. అలాగే సలార్ -2, రాజా సాబ్, స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు