Kapila Venu : గుడిలో అలా టచ్ చేస్తూ… కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి ఆవేదన

Kapila Venu : ప్రముఖ తమిళ నటి కపిల వేణు తనకు ఏకంగా గుడిలోనే చేదు అనుభవం ఎదురయిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదనను వ్యక్తం చేసింది. టెంపుల్ కి వెళ్లిన తనను ఓ వ్యక్తి ఫిజికల్ గా తాకుతూ ఇబ్బందికర పరిస్థితిలను క్రియేట్ చేశాడు అంటూ పోస్ట్ చేసింది. ఇంతకీ ఈ నటిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరు? అసలేం జరిగింది అంటే….

కపిల కేరళ రాష్ట్రానికి చెందిన కూడియాట్టం నర్తకి. తాజాగా తన స్నేహితురాలు పెర్ఫార్మెన్స్ చూడడం కోసం స్థానికంగా ఉన్న గుడిలో జరిగిన ఉత్సవానికి హాజరయ్యాను అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లో చెప్పుకొచ్చింది ఈ నటి. అయితే తనకు ఎగ్జిట్, ఎంట్రీ ల గురించి సరిగ్గా తెలియక ఎగ్జిట్ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాను అని, కానీ ఆ తర్వాత అర్థమయి ఎగ్జిట్ నుంచి ఎంట్రీ క్యూలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న వాలంటీర్ తనతో రూడ్ గా బిహేవ్ చేశాడని వెల్లడించింది. సదరు వాలంటీర్ తనను టచ్ చేసి, ఆపి ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేశాడని, అయితే ఊహించని ఈ హఠాత్ పరిణామానికి తనకు కోపం వచ్చిందని వెల్లడించింది.

అతని ఓవర్ యాక్షన్ చూసి షాక్ అయిన మాటలతో చెప్పి ఆపి ఉండొచ్చు కదా, ఇలా టచ్ చేయడం ఏంటి అని గట్టిగానే ప్రశ్నించానని పేర్కొంది. అయితే అతను ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరించడంతో అరవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో ఆరుగురు వాలంటీర్లు తప్పు నాదే అంటూ నన్ను టార్గెట్ చేశారని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వివరించింది. అంతేకాకుండా గుడి దగ్గర సీన్ క్రియేట్ చేయొద్దు అంటూ, తనను వెంటనే వెళ్ళిపోవాలని వాళ్లంతా కోరారని, ఆ సమయంలో ప్యానిక్ ఎటాక్ అవుతుందేమోనని భయం వేసి పోలీస్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్లానని వివరించింది.

- Advertisement -

కానీ విచిత్రంగా పోలీసులు కూడా వెంటనే ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదని, దీంతో తనకు కన్నీళ్లు ఆగలేదని ఆవేదనను వ్యక్తం చేసింది. తను కన్నీళ్లు పెట్టుకున్న తర్వాతే పోలీసులు స్పందించి కమిటీ మెంబర్లతో మాట్లాడామని చెప్పారని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత ఆ కమిటీ మెంబర్లలో ఒకరు వచ్చి వాలంటీర్లతో మాట్లాడి, అనంతరం తన పేరు, తండ్రి పేరు తెలుసుకొని గుడిలోకి పంపించారని చెప్పుకొచ్చింది. అయితే తను ఇంకేదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే తండ్రి పేరు కనుక్కొని తనను లోపలికి పంపించడం నచ్చలేదని, ఇలా ఒక చిన్న టౌన్ లో ఉండే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని వెల్లడించింది. నిజానికి ఆ గుడికి జనాలు ఎక్కువగా రావడం వల్ల అందరిని కంట్రోల్ చేయడం అక్కడికి వాలంటీర్లకు ఇబ్బందిగా మారిందని, అయినప్పటికీ మరింత జాగ్రత్తగా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అంటూ ఏకంగా సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయట పెట్టింది. కాగా కపిల రీసెంట్ గా విడుదలైన జిగర్తాండ మూవీలో కీలక పాత్రలో నటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు