HBD Ram Pothineni : చాక్లెట్ బాయ్ నుండి ఉస్తాద్ ఇస్మార్ట్‌గా అప్డేట్… యంగ్ హీరో ఇన్స్పిరేషనల్ జర్నీ

HBD Ram Pothineni : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు చాక్లెట్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల సక్సెస్ తో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని అలరించి, ఇప్పుడు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ గా అభిమానులని అలరిస్తున్నాడు. కేవలం పదహారేళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, మీడియం రేంజ్ హీరోల్లో ఒకడిగా యూత్ లో సూపర్ క్రేజ్ ని సంపాదించాడు. 2006లో తన సినీ కెరీర్ ప్రారంభించిన రాపో విజయవంతంగా తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. దాదాపు 18 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో ఎన్నో ఎన్నో సార్లు పడిలేస్తూ, ఇస్మార్ట్ ఉస్తాద్ గా తన క్రేజ్ ని పెంచుకుంటున్నాడు. ఇక నేడు రామ్ పోతినేని (మే 15) బర్త్ డే (HBD Ram Pothineni) ఈ సందర్బంగా తన కెరీర్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలని చాక్లెట్ బాయ్ నుండి ఉస్తాద్ ఇస్మార్ట్ గా రామ్ ఛేంజోవర్ పై ఓ లుక్కేద్దాం.

చాక్లెట్ బాయ్ నుండి.. ఇస్మార్ట్ గా..

రామ్ పోతినేని మే 15, 1988న జన్మించగా, ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మేనల్లుడిగా, ఇండస్ట్రీ కి “దేవదాసు” సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వై.వీ.ఎస్.చౌదరీ డైరెక్షన్‌లో 2006లో రూపొందిన ‘దేవదాసు’ సినిమా సూపర్ హిట్‌తో రామ్‌కి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత జగడం ప్లాప్ అయినా నటుడుగా మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇక శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ నటించిన ‘రెడీ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత రామ్‌కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన మస్కా, రామరామ కృష్ణకృష్ణ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా, వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. మధ్యలో పండగ చేస్కో, హైపర్, సినిమాలు యావరేజ్ గా ఆడగా ‘హలో గురు ప్రేమ కోసమే’ నేను శైలజ సినిమాలు హిట్ అయ్యాయి. అయితే రామ్ మాత్రం తన పట్టు వదలలేదు. విలక్షణమైన నటనతో అతను ప్రేక్షకులను మెప్పు పొందుతూనే వచ్చారు. టాలీవుడ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తర్వాత అంత ఎనర్జిటిక్ గా డాన్స్ చేసే హీరోగా రామ్ కి పేరుంది. ఇక అంతే ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తాడు. నిజం చెప్పాలంటే ఒక స్టార్ హీరో అయ్యే లక్షణాలన్నీ రామ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. కానీ సరైన సినిమాలు పడక ఇంకా మీడియం రేంజ్ స్టార్ గా ఉన్నాడు.

HBD Ram Pothineni Birth Day Special

- Advertisement -

డబుల్ ఇస్మార్ట్ తో డబుల్ బొనాంజా..

ఇక వరుస పరాజయాలతో ఉన్న రామ్ కెరీర్ కి ఓ రేంజ్ బూస్టప్ ని ఇచ్చిన సినిమా “ఇస్మార్ట్ శంకర్”. 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని అందుకుంది. అప్పటివరకూ చాక్లెట్‌ బాయ్‌ లా ఉన్న రామ్‌ను ఈ సినిమాలో పక్కా మాస్ హైదరాబాదీ ఉస్తాద్ గా పూరీ చూపించాడు. ఈ సినిమాతో రామ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఇక రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ శంకర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ది వారియర్, స్కంద వంటి పరాజయాలు అందుకున్నాడు రామ్. అయినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు తన రేంజ్ పెంచిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ రామ్ సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ రామ్ పోతినేని కి “ఫిల్మీఫై” తరపున బర్త్ డే విషెస్ ని అందచేస్తున్నాము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు