Kalki 2898 AD : రిలీజ్ డేట్లు రెండు… సమస్యలు మాత్రం బోలెడు

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి రిలీజ్ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. మేకర్స్ సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో మే 30న లేదంటే జూన్లో మూవీ రిలీజ్ అవుతుందని జోరుగా రూమర్లు ప్రచారం అవుతున్నాయి. అయితే కల్కికి రిలీజ్ డేట్లు రెండే అయినా సమస్యలు మాత్రం బోలెడు. మరి కల్కిని వెంటాడబోతున్న ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాయిదాతో మొదలై… రెండు రిలీజ్ డేట్లు

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికల షెడ్యూల్ కారణంగా కల్కి మూవీ వాయిదా పడింది. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ మరోసారి పోస్ట్ పోన్ కావడం రెబల్ స్టార్ అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే మూవీ రిలీజ్ డేట్ గురించి మేకర్స్ రెండు డేట్లను ఆప్షన్ లో పెట్టుకున్నట్టుగా ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఒకటి మే 30 అని, రెండవది జూన్ 20 అని సమాచారం. ఏదైతేనే మొత్తానికి జూలైలోపు సినిమాను రిలీజ్ చేయాలని, లేదంటే ఆ తర్వాత రిలీజ్ డేట్ దొరికే అవకాశం లేదనే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం. అయితే మరి కొంత మంది మాత్రం జూన్ 13న కల్కి మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారని ప్రచారం చేస్తున్నారు.

జూన్ పై ఆల్రెడీ కర్చీఫ్ చేసిన కమల్

జూన్ 13న ఇప్పటికే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. శంకర్ ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో కల్కి ఇండియన్ 2 మూవీతో క్లాష్ కు రెడీ అవుతుందా అంటే సమాధానం కచ్చితంగా నోనే అవుతుంది. కమల్ హాసన్ కల్కి మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి కమల్ మూవీతో క్లాష్ కు ప్రభాస్ రెడీ కాకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

- Advertisement -

రాజకీయ కోణం కూడా ఉంది

ఇదిలా ఉంటే మరోవైపు రాజకీయ కోణం కూడా కల్కి మేకర్స్ ని టెన్షన్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాత అశ్విని దత్ టిడిపి మద్దతుదారు అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. దీంతో ఆంధ్రాలో కల్కి మూవీ టికెట్ రేట్ల హైక్ విషయమై డైలమాలో పడ్డారు. గతంలో సలార్ మూవీ కోసం 50 రూపాయలు పెంపుకు సంబంధించిన అనుమతులను ప్రభుత్వం నుంచి పొందడానికి తెగ కష్టపడాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు కల్కి మూవీ ఎంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు ఈ మూవీకి 50 రూపాయల కంటే ఎక్కువగానే పెంపును కోరాల్సి ఉంటుంది మేకర్స్. కానీ ఒకవేళ ఈ ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే చిత్ర యూనిట్ కల్కికి భారీ టికెట్ ప్రైస్ హైక్ ను ఆశించడం కష్టమేనని టాక్ నడుస్తోంది. మరి ఈ కష్టాలను కల్కి ఎలా గట్టెక్కుతాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు