Bhagyasree Borse : మరో శ్రీలీల తయారవుతోందా? ఆ తప్పు రిపీట్ చెయ్యకపోతే బెటర్

Bhagyasree Borse : ఇండస్ట్రీలో హీరోయిన్లకు వరసగా అవకాశాలు రావడం అనేది డ్రీమ్ లాంటిదని చెప్పొచ్చు. కొంతమందికి ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ పెద్దగా లక్ కలిసి రాదు. మరి కొంతమందికి లక్ కలిసి వచ్చినా స్టార్ హీరోయిన్ల రేసులో నిలబడడంలో తడబడతారు. ఇక తాజాగా టాలీవుడ్ లో భాగ్యశ్రీ బోర్సే జోరు చూసి ఆమె మరో శ్రీలీలగా మారబోతుందా? అని అనుమానాలు మొదలయ్యాయి. మరి ఇంతకీ వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న పోలిక ఏంటి? అంటే…

శ్రీలీల చేసిన తప్పు ఇదే

శ్రీలీల పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ నెక్స్ట్ మూవీలోనే రవితేజ లాంటి సీనియర్ హీరోతో నటించే అవకాశం వచ్చింది. ఇక రవితేజ శ్రీలీల కలిసిన నటించిన ధమాఖా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. వరసగా సినిమాలకు సైన్ చేస్తూ వెళ్లిపోయింది. అయితే ఇక్కడే తప్పులో కాలేసింది శ్రీలీల.

బడా హీరోలు, బిగ్ బ్యానర్ అయితే చాలు సినిమాకు సైన్ చేసింది. కానీ అందులో తన పాత్ర, దాని ప్రాధాన్యత గురించి పెద్దగా పట్టించుకోలేదు ఈ కన్నడ బ్యూటీ. దీంతో అతి కొద్ది కాలంలోనే ఆమె జోరుకు స్పీడ్ బ్రేక్ పడడంతో ఇండస్ట్రీలో కనబడకుండా పోయింది శ్రీలీల. ఇక ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అనుకున్న శ్రీలీల సైడ్ అయిపోవడంతో ఆమె ప్లేస్ ను భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేస్తుందంటూ ప్రచారం మొదలైంది.

- Advertisement -

హిట్స్ నిల్… ఛాన్సులు ఫుల్

ఇప్పటివరకు ఒక్క హీట్ కూడా కొట్టని భాగ్యశ్రీ బ్యూటీ చేతిలో ఏకంగా మూడు సినిమాలు పడ్డాయని టాక్ నడుస్తోంది. మాజీ మిస్ ఇండియా కంటెస్టెంట్ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. హరిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇంకా తెరపైకి రాకముందే మరో రెండు సినిమాలు ఈ బాలీవుడ్ బ్యూటీ కిటీలో పడ్డాయని టాక్ నడుస్తోంది.

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రాబోతున్న నెక్స్ట్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆ తర్వాత ఆమె నాని, సుజిత్ ల కాంబోలో రాబోతున్న మరో క్రేజీ మూవీలో కూడా భాగం కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ ఈ మూడు సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా భాగ్యశ్రీ కెరియర్ టర్న్ అవ్వడం ఖాయం. కాకపోతే ఈ ప్రయాణంలో ఆమె శ్రీలీల చేసిన తప్పును రిపీట్ చేయకుండా ఉంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకునే అవకాశం దక్కుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు