Naveen Yerneni: పుష్ప నిర్మాత మెడకు బిగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు…!

Naveen Yerneni.. మైత్రి మూవీస్.. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత పేరున్న బడా నిర్మాణ సంస్థ..పైకి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్ద పెద్ద స్టార్స్ తో వరుసగా సినిమాలు చేస్తూ.. నిజ జీవితంలో మాత్రం ఇల్లీగల్ దందాలు చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో చిక్కుకున్నారు మైత్రి మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని. వివాదాల నిర్మాత నవీన్ ఎర్నేని పై ” స్వేచ్ఛ” స్పెషల్ ఫోకస్.. పైకి బడా నిర్మాత అనిపించుకుంటూ లోపల చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను “స్వేచ్ఛ దినపత్రిక” అడ్డుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే విస్తుపోయే నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది.. మరి నవీన్ ఎర్నేని దందాలు, ఇల్లీగల్ పనుల గురించి.. ఆయన చేస్తున్న అక్రమాల గురించి ఒక్కొక్కటిగా బయటకు తీసే ప్రయత్నం చేసింది.

Naveen Yerneni: Pushpa producer struck in phone tapping case..!
Naveen Yerneni: Pushpa producer struck in phone tapping case..!

కిడ్నాప్ కేసులో అరెస్ట్..

ఒక హెల్త్ కేర్ సంస్థ యజమాని అయిన వేణుమాధవ్ ను కిడ్నాప్ చేయడంలో మైత్రి మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని కీలకపాత్ర పోషించారు. అలాగే గోల్డ్ ఫిష్ సీఈఓ చంద్రశేఖర్ తో పాటూ క్రియా హెల్త్ కేర్ డైరెక్టర్ లుగా కొనసాగుతున్న గోపాల్ , రాజ్, నవీన్, రవి, బాలాజీ ల షేర్స్ మార్పిడి చేసేందుకే వేణుమాధవ్ ఫోన్ ట్యాప్ చేసి.. వేణుమాధవ్ ను రాధా కిషన్ రావు, గట్టుమల్లు ఎస్ఐ మల్లికార్జున్ ఒత్తిడి చేశారు. వినకపోవడంతో కిడ్నాప్ చేశారు.. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి.. తాజాగా అరెస్టు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.

ఐటి దాడుల్లో బయటపడ్డ బండారం..

సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి వచ్చిన బ్లాక్ మనీ అంతా భూముల రూపంలో పెట్టుబడి పెట్టించడంలో ఈయన దిట్ట.. గతంలో ఐటి సోదాలతో ఇది కాస్త బయటపడింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధా కిషన్ రావు ని మచ్చిక చేసుకుని.. ఎన్నో దందాలకు పాల్పడ్డారు నవీన్. అయితే ఇవన్నీ బయటకు వస్తే నవీన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తాజా సంఘటనతో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది..

- Advertisement -

లక్షల్లో పెట్టుబడి కోట్లల్లో భూ దందాలు..

ముఖ్యంగా నవీన్ ఎర్నేనికి సంబంధించి తొమ్మిది నెలల క్రితం ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించగా.. లక్షల్లో పెట్టుబడి పెట్టి కోట్లల్లో భూ దందాలు చేశాడని తెలుస్తోంది. సినీ ప్రముఖుల వద్ద నుంచి బ్లాక్ మనీ తీసుకుని నగర శివార్లలో భూములు కొనుగోలు చేశారు.. ఇప్పటికీ అవి రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు. శంకర్ పల్లి, చేవెళ్ల, షాద్ నగర్, ఇబ్రహీంపట్నంలో వందల ఎకరాలు ఆయన గుప్పెట్లో ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ తో పాటు బ్లాక్ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక సినీ పరిశ్రమను తన గుప్పెట్లోకి తీసుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తన మాట వినని వారిని పబ్బులకు పార్టీలకు తీసుకెళ్లి వారి పైన డ్రగ్స్ దందా అంటూ వేధించే వారని.. అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. కానీ అందరూ చూసి చూడనట్టు వదిలేశారు.. అయితే ఇప్పుడు ఈయన ఐటి దందాలన్నీ బట్టబయలు కావడంతో సినీ ప్రముఖులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు . టాప్ హీరోల ఆస్తులను కూడా ఈయనే మెయింటెన్ చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి..

 

ఫేక్ ఫిర్యాదులపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం..

ఇకపోతే గతంలోనే ఫేక్ ఫిర్యాదులపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం ఇచ్చింది.. చీటర్స్ అందరూ కూడా తమ ఫోన్ ట్యాప్ అయ్యాయని పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేశారు.. పైగా వారికి మద్దతు ఇచ్చే మీడియాలో ఇటువంటి వార్తలను హల్చల్ చేయించారు ..ఫోన్ ట్యాపింగ్ కు సంబంధంలేని విషయాలను కూడా ఇష్టానుసారంగా కథనాల రూపంలో వల్లిస్తున్నారు. వారి సొంత ప్రయోజనాల కోసం మీడియాని వాడుకుంటున్నారు. అయితే అసలు నిందితులెవరో తెలియని పోలీసులు కేసును తప్పు దోవ పట్టించవద్దని డిసిపి విజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా మీడియాలో వార్తలు చెప్పేముందు జాగ్రత్తలు అవసరమని.. అలాగే కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. నలుగురిపై పూర్తి స్పష్టత ఉంది.. కొంతమంది అధికారులు అప్రూవర్ గా మారుతున్నారని తెలుస్తున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది కలవకుండా ఉండేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే తెరపైన బడా నిర్మాతగా పేరు దక్కించుకుంటూ వెనుకల గలీజు దందాలు చేస్తూ పెద్దమనిషిగా చలామణి అవుతున్నారు నవీన్ ఎర్నేని. నేరం నిరూపితమైతే త్వరలోనే అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు