Snoring Side Effects : గురకతో అకాల మరణం… అసలు గురకకు కారణం ఏంటంటే?

Snoring Side Effects : గురకను చాలా మంది సాధారణ అలవాటుగా పరిగణిస్తారు. అస్సలు సీరియస్ గా తీసుకోరు. ఇక మరి కొంతమంది అయితే దీన్నొక చెడు అలవాటుగా చూస్తారు. ఎందుకంటే గురక వల్ల చాలా చికాకు కలుగుతుందని ఫీల్ అవుతారు, ఇబ్బంది పడతారు. కానీ వాస్తవానికి గురక అనేది ఒక తీవ్రమైన సమస్యకు సంకేతం అంటున్నారు డాక్టర్లు. అదే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. చాలా సందర్భాలలో గురక అకాల మరణానికి దారి తీసే అవకాశం ఉందని చెప్పి షాక్ ఇస్తున్నారు డాక్టర్స్.

అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారం అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్, అకాల మరణాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. స్త్రీల కంటే పురుషులకు గురక లేదా స్లీప్ అప్నియా ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గురక ప్రాణాంతకంగా ఎలా మారుతుంది?

పగటి పూట ఎక్కువగా నిద్ర రావడం, తరచుగా లేదా బిగ్గరగా గురక పెట్టడం, లేదా నిద్రలో శ్వాస తీసుకోవడం ఆపేయడం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే అలాంటి వాళ్ళు డాక్టర్ల దగ్గరకు వెళ్లడం అవసరం. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడే గురక ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించండి.

- Advertisement -

NCBI ప్రకారం, గురక వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 46 శాతం పెరుగుతుంది. ఇది ధమని దెబ్బతిన్నది అనేదానికి కూడా సంకేతం కావచ్చు.

ఇక రాత్రిపూట రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు బాత్రూమ్‌ని ఉపయోగించడానికి లేవడాన్ని నోక్టురియా అంటారు. ఇది పురుషులు, స్త్రీలలో గురకతో కూడా ముడిపడి ఉంటుంది. 55 ఏళ్లు పైబడిన పురుషులు తరచుగా మూత్ర విసర్జన చేయడానికి లేవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రోస్టేట్ గ్రంథికి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకు ఉండే సంబంధం కారణంగానే ఇలా జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

గురకను ఎలా ఆపాలంటే?

నిద్రించేటప్పుడు బోర్లా పడుకుంటే గురక మరింత ఇబ్బంది పెడుతుంది. బోర్లా పడుకోవడం వల్ల నాలుకతో పాటు ఇతర గొంతులోని కణజాలాలు వాయు మార్గానికి అడ్డుపడతాయి. దీంతో గురక వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. కాబట్టి సైడ్ కు తిరిగి పడుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల గురక తగ్గడంతో పాటు ఈజీగా శ్వాస తీసుకోగలుగుతారు.

గురకకు కారణాలేంటి ?
1. ఆల్కహాల్ లేదా ఆహారం

నిద్రపోయే ముందు ఎక్కువగా ఆహారం లేదా ఆల్కహాల్ వంటివి తీసుకోవద్దు. పడుకునే ముందు మద్యం సేవించడం వల్ల గొంతు కండరాలు రిలాక్స్ అవుతాయి. అది గురకకు దారి తీస్తుంది. కాబట్టి కనీసం పడుకోవడానికి ముందు మూడు గంటల ముందే ఆహారాన్ని తీసుకోండి. అలాగే మద్యపానానికి దూరంగా ఉండండి.

2. సిగరెట్ తాగొద్దు

ధూమపానం అనేది గొంతు, శ్వాసనాళాలలో వాపుకు కారణం అవుతుంది. దీని వల్ల గురక వస్తుంది. కాబట్టి సిగరెట్ తాగడం మానేస్తే గురక సమస్య తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

3. అధిక బరువు

కావలసిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నవారు కూడా గురక బారిన పడతారు. కాబట్టి బరువును కంట్రోల్ లో ఉండేది చూసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు