Relationship Tips : అమ్మాయిల్లో ఉన్న ఈ అలవాట్లకే మరి అబ్బాయిలు పడి చచ్చేది

Relationship Tips : సాధారణంగానే స్త్రీల అందం పురుషులను ఆకర్షిస్తుంది. కానీ ఎక్కువ కాలం పురుషుల హృదయాల్లో స్థానం సంపాదించడానికి కేవలం అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోదు. మరికొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉండాలి. నిజానికి చిరాకు లేదా ఇతర సమస్యాత్మక స్వభావం కలిగి ఉండే అమ్మాయిలను అబ్బాయిలే కాదు ఎవరైనా సరే వెంటనే వదిలించుకోవాలని కోరుకుంటారు. కానీ మరి కొంతమంది అమ్మాయిలను మాత్రం చూడగానే పడిపోతారు అబ్బాయిలు. ముఖ్యంగా వాళ్ళ అభిరుచులకు, ఆలోచనలకు దగ్గరగా ఉండే అమ్మాయిలతో లైఫ్ లాంగ్ ఉండాలి అని కలలు కంటారు అబ్బాయిలు. మరి బాయ్స్ ని అతి తక్కువ సమయంలోనే ఆకట్టుకునే అమ్మాయిల అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సరదాగా ప్రేమించడం

చిన్న చిన్న విషయాలకి సీరియస్ గా ఉండే అమ్మాయిలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు అబ్బాయిలు. వాళ్ల నుంచి వీలైనంత ఎక్కువ దూరం పారిపోవడానికి ఇష్టపడతారు. కానీ ఉల్లాసంగా, సరదాగా కనిపించే అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ, ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ తూనీగల్లా కనిపించే అమ్మాయిలకు ఇట్టే అట్రాక్ట్ అవుతారు. కాబట్టి అమ్మాయిలు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.

2. సింప్లిసిటీ

సాధారణంగా కొంతమంది అమ్మాయిలు ఓవర్ గా మేకప్ చేసుకోవడానికి, మరింత మోడ్రన్ లుక్ లో కనిపించడానికి తెగ కష్టపడతారు. అబ్బాయిలను అట్రాక్ట్ చేయడానికి ఇదొక దారి అని అనుకుంటారు. అది కొంతవరకు నిజమే. కానీ అబ్బాయిల హృదయాల్లో ఎక్కువ కాలం నిలిచిపోవాలంటే మేకప్ ఒక్కటే ఉంటే సరిపోదు. మోడ్రన్ అనేది కూడా పెద్దగా మేటర్ కాదు. ఎక్కువ శాతం అబ్బాయిలు సింప్లిసిటీ మైంటైన్ చేసే అమ్మాయిలని ఇష్టపడతారు. కాబట్టి మీ దగ్గర ఉన్న వస్తువులతోనే సింపుల్ గా అండ్ స్టైలిష్ గా ఉండడానికి ట్రై చేయండి.

- Advertisement -

3. సెల్ఫ్ డిపెండెన్స్

చాలా మంది అమ్మాయిలు చిన్న చిన్న పనుల కోసం తమ తండ్రి, సోదరుడు లేదా మేల్ ఫ్రెండ్ పై ఆధారపడతారు. కానీ అబ్బాయిలు ఇలా ఎక్కువగా మగాళ్ళపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకునే మంచి లైఫ్ స్టైల్ స్కిల్స్ ఉన్న అమ్మాయిలను ఇష్టపడతారు.

4. తెలివితేటలు కూడా ముఖ్యమే

ఎంత అందంగా ఉన్నా సరే తెలివితేటలు లేకుంటే అబ్బాయిలు అమ్మాయిలను సపోర్ట్ చేయడం చాలా కష్టం. ఈ రోజుల్లో అబ్బాయిలు తెలివితేటలతో పాటే అందం ఉన్న అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్లను లైఫ్ పార్ట్నర్ చేసుకుంటే జీవితంలోని కష్టాలను ఈజీగా దాటవచ్చు అనే ఆలోచనతో ఇలా ఫీల్ అవుతారు.

5. సపోర్టివ్

వర్క్ లేదా జీవితానికి సంబంధించిన నిర్ణయాలలో అమ్మాయిలు పూర్తి సపోర్ట్ ఇస్తే చాలు అబ్బాయిలు కూడా వాళ్ల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకడుగు వేయరు. కాబట్టి అబ్బాయిలు తీసుకునే నిర్ణయాలకు సపోర్ట్ ఇచ్చి, వాళ్ల ప్రేమను మరింతగా పొందండి. ఈ 5 లక్షణాలు ఉంటే చాలు ఆ అమ్మాయిలను అబ్బాయిలు పిచ్చి పిచ్చిగా ఇష్టపడతారు. మరి మీరు కూడా ఇలాగే ఉన్నారా అమ్మాయిలూ?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు