Archana: ఆ హీరోయిన్ వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది..!

Archana.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అర్చన సక్సెస్ కాకపోవడంతో పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా అలాగే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. అందానికి అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ముఖ్యంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు ఖలేజా వంటి చిత్రాలలో కూడా నటించింది. స్టార్ హీరోల సినిమాలలో నటించినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. పైగా హీరోయిన్ గా అర్చన కెరియర్ నాశనం కావడానికి ఒకే ఒక సినిమా అన్నట్లుగా.. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది అర్చన. వాటి గురించి చూద్దాం.

Archana: My carrier spoild because of her..!
Archana: My carrier spoild because of her..!

త్రిష మూవీ వల్లే నా జీవితం నాశనం..

అర్చన కెరియర్ నాశనం కావడానికి కారణమైన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఈ చిత్రంలో అర్చన త్రిషకి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. ఆ సమయంలో అర్చనకి హీరోయిన్ గా పలు సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయట.అయితే ఈ సినిమాలో త్రిష ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించడం ఇష్టం లేకపోయినా నటించానని.. తనతో ఈ క్యారెక్టర్ ని చాలా బలవంతంగా ఒప్పించారని కూడా వెల్లడిస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర తనకు చాలా బెనిఫిట్ అవుతుందని కూడా చెప్పారని.. ఒక విధంగా ఈ సినిమా మంచి సక్సెస్ అయి ఉండవచ్చు కానీ తన కెరీర్ ను నాశనం చేసిన సినిమాగా మిగిలిపోయిందని అర్చన తెలిపింది.

ఆ సమయంలో బాగా ఏడ్చేసాను..

నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో తనకు ఇష్టం లేకపోయినా కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వచ్చింది.. ఏ హీరోయిన్ కైనా ముఖ్యంగా కళ్ళే చాలా ఆకర్షణీయంగా కనిపించాలి.. కానీ ఈ సినిమా షూటింగ్ మొత్తం కళ్ళజోడుతోనే కనిపించాను. దీంతో ఈ సినిమా షూటింగ్ సెట్ లో ఒకసారిగా ఏడ్చేసేదాన్ని అంటూ అర్చన తెలియజేస్తోంది.. చాలామంది ఈ సినిమా చూసిన తర్వాత హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది.. ఇక ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సెట్ అవుతుంది అంటూ ముద్ర వేశారని వెల్లడించింది. అలా కొన్ని సినిమాల్లో హీరోయిన్ నుంచి కూడా తీసేసారని వెల్లడించింది.

- Advertisement -

అందుకే రాజమౌళి మూవీలో ఛాన్స్ కూడా మిస్ అయ్యా..

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా తర్వాత తనకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని.. మగధీర సినిమాలో హీరోయిన్ సలోని చేసిన పాత్రలో మొదట రాజమౌళి తనను అడిగారని.. కానీ అప్పటికే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో నటించి తప్పు చేశానని అందుకే ఆచితూచి అడుగులు వేయాలనుకున్నాను అంటూ తెలిపింది.. ఇకమీదట అలాంటి పాత్రలు చేయకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నానని.. అందుకే మగధీర సినిమాని కూడా రిజెక్ట్ చేశానంటూ వెల్లడించింది. అయితే అప్పుడు రిజెక్ట్ చేయడం తనకు చాలా బాధనిపించింది అంటూ వెల్లడించింది. మొత్తానికైతే ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేసి కెరీయర్ ను నాశనం చేసుకున్న అర్చన ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. మరి ఇప్పటికైనా ఈమెకు దర్శక నిర్మాతలు సరైన పాత్రలు ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని కూడా చెబుతోంది. మరి ఎవరు ఈమె కెరీర్ సక్సెస్ కు పునాది వేస్తారు చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు