Kamal Haasan vs Mammootty : కమల్ తో క్లాష్ కు రెడీ… మమ్ముట్టి ధైర్యం వాళ్లేనా?

Kamal Haasan vs Mammootty : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు పట్టాలెక్కుతున్నాయి. ఎప్పుడు ఏ రెండు సినిమాల మధ్య బిగ్గెస్ట్ క్లాష్ ఏర్పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఏకంగా పాన్ ఇండియా స్టార్ కమల్ హాసన్ ను ఢీకొట్టే ధైర్యం చేస్తున్నారు. మరి ఇంతకీ ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

మమ్ముట్టి vs కమల్ హాసన్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ మధ్య క్లాష్ రాబోతోంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 మూవీ జూన్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఈ మూవీని జూన్ 13న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు మమ్ముట్టి హీరోగా నటిస్తున్న టర్బో మూవీ కూడా అదే తేదీన మలయాళంలో థియేటర్లలోకి రాబోతోంది. సోషల్ మీడియా ద్వారా మమ్ముట్టి ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. టర్బో మూవీలో కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇందులో కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఇంట్రెస్టింగ్ చేజింగ్ లు ఉంటాయని సమాచారం. మరోవైపు శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. దీంతో ఈ నేపథ్యంలోనే ఇండియన్ 2 మూవీతో టర్బో అనే రీజనల్ మూవీ పోటీకి దిగడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి వీరిద్దరిలో బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచేది ఎవరు ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇద్దరు హీరోల అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

అయితే నిజానికి మలయాళ హీరోలు ఎంత పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆ మాటకొస్తే కేవలం మలయాళీలు మాత్రమే కాదు ఇతర భాషల హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నా జంకకుండా తమ తమ భాషల్లో సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు. ప్రాంతీయవాదానికి తెరతీస్తూ ఎవరో బయట వాళ్ళు వస్తే మాకేంటి భయం? మేము పక్కా లోకల్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. మొత్తానికి ఈ స్టార్ హీరోలు తమ అభిమానుల అండ చూసుకొని పాన్ ఇండియా సినిమాలకు పోటీకి దిగుతున్నారు.

- Advertisement -

సీన్ రిపీట్…

సలార్ మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్లలోకి రాగా, దానికి ఒక రోజు ముందే మోహన్ లాల్ హీరోగా నటించిన నేరు మూవీని థియేటర్లలోకి దించారు. ఇక కన్నడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కన్నడ నటుడు దర్శన్ సలార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సలార్ రిలీజ్ అయిన వారం రోజుల వ్యవధిలోనే కాటేరాను థియేటర్లలోకి దించారు. అయితే ఈ క్లాష్ గురించి దర్శన్ దగ్గర ప్రస్తావించగా, ఇది మా అడ్డా… వాళ్ళ సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. అలాంటప్పుడు మేము ఎందుకు భయపడాలి. తగ్గితే వాళ్ళు తగ్గాలి గాని మేము ఎందుకు తగ్గుతాం అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ఇక హిందీలో చెప్పక్కర్లేదు. ఏకంగా షారుక్ ఇలాగే వ్యవహరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు