Aranmanai 4 : తమన్నా, రాశి ఖన్నా గ్లామర్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగలరా? పెద్ద సాహసమే

Aranmanai 4 : సీనియర్ హీరోయిన్లు రాశి కన్నా, తమన్నా తాజా గ్లామర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ అరణ్మణై 4 అనే మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ ఇద్దరు గ్లామర్ క్వీన్లు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగలరా? మేకర్స్ రిస్క్ చేస్తున్నారా? అనే విషయంలోకి వెళ్తే…

సుందర్ సి దర్శకత్వంలో తమన్నా, రాశి కన్నా హీరోయిన్లుగా నటించిన హారర్ కామెడీ మూవీ అరణ్మణై 4. ఈ మూవీ ఈనెల 26న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ లో తమన్నా, రాశి ఖన్నా లను గ్లామర్ గా చూపించి అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. అయితే ఈ ప్రమోషన్స్ చూస్తుంటే మేకర్స్ కంటెంట్ కంటే ఎక్కువగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల గ్లామర్ పైనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా అన్పిస్తోంది. కానీ మేకర్స్ ఆశిస్తున్నట్టుగా ఈ ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదా? అన్నదే ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న.

హీరోయిన్లు ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించలేరు అని కాదు గాని ఇలా ఎంతవరకు రప్పించగలరు. అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుని, హీరోలు లేకుండానే లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఒంటి చేత్తో లాక్కొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళు ఇలా తమన్నా, రాశిలా చిట్టి పొట్టి బట్టలతో ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేసే దారిని ఎంచుకోలేదు. మరి వీరి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -

అరణ్మణై ఫ్రాంచైజీకి అంత సీన్ ఉందా?

నిజానికి అరణ్మణై ఫ్రాంచైజీలో అరణ్మణై 4 అనేది నాలుగవ మూవీ. హారర్, కామెడీ ఎలిమెంట్స్ తో ఈ నాలుగు ఫ్రాంచైజీల కథాంశం రూపొందింది. అయితే అరణ్మణై ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సీక్వెల్స్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఇప్పుడు అరణ్మణై 4 కోసం మేకర్స్ పూర్తిగా తమన్నా, రాశి ఖన్నాల గ్లామర్ పై ఆధారపడినట్టుగా కనిపిస్తోంది. వీళ్ళిద్దరూ అద్భుతమైన కాస్ట్యూమ్స్ లో డాన్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు అట్ట్రాక్టివ్ గా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ గ్రిప్పింగ్ స్టోరీ, పర్ఫెక్ట్ మేకింగ్ ఉంటేనే హీరోతో పని లేకుండా హీరోయిన్లు సినిమాను లాక్కురాగలరు. కేవలం గ్లామర్ షోపై ఆధారపడి మూవీని థియేటర్లలోకి తీసుకొస్తే ఫలితం దారుణంగా ఉంటుందని ఇప్పటికే ఎన్నో సినిమాలకు ప్రూవ్ అయ్యింది.

ఇక తెలుగు మార్కెట్ విషయానికి వస్తే…

ఈ మూవీని బాక్ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కించారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. కానీ ప్రస్తుతం తమిళ సినిమాలకు తెలుగులో మార్కెట్ చాలా దారుణంగా ఉంది. ఇప్పటిదాకా ఎన్నో తమిళ సినిమాలు రిలీజ్ అయినప్పటికీ అందులో కొన్ని మాత్రమే మంచి సక్సెస్ అయ్యాయి. అయితే అరణ్మణై సిరీస్ కి ఇక్కడ కూడా అభిమానులు ఉన్నారు. కానీ ఈసారి తమన్నా, రాశి కన్నాల గ్లామర్ మాత్రమే ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలి అని మేకర్స్ చేస్తున్న ప్రయత్నం అతి పెద్ద సాహసం అయిన్ చెప్పొచ్చు. మరి వీళ్ల ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు