Raashi Khanna and Tamannah : అప్పుడీ గ్లామర్ క్వీన్లను ఎవ్వడూ పట్టించుకోలే… ఇప్పుడు ఇలా రెచ్చిపోతున్నారేంటి?

Raashi Khanna and Tamannah : లేటెస్ట్ హారర్ మూవీ బాక్ లో టాలీవుడ్ ముద్దుగుమ్మలు తమన్నా, రాశి కన్నా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పంచుకో అనే పాటలో ఇద్దరూ కలిసి అభిమానులు కళ్ళు తిప్పుకోలేని విధంగా గ్లామర్ షో చేయడంతో పాటు హాట్ హాట్ గా అదిరిపోయే స్టెప్పులు కూడా వేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ గతంలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి స్పెషల్ సాంగ్ చేస్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడేమో ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి ఫోటోలు, వీడియోలే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరి అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

బాక్ లో రాశి, తమన్నా స్పెషల్ సాంగ్ వైరల్

తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న హారర్ కామెడీ సిరీస్ అరణ్మణై. ఈ సిరీస్ నుంచి తాజాగా అరణ్మణై 4 అనే పేరుతో నాలుగవ భాగం తెరపైకి రాబోతోంది. తెలుగులో బాక్ అనే టైటిల్ తో ఈ మూవీని మేకర్స్ రిలీజ్ చేస్తుండగా, సుందర్ సి దర్శకత్వం వహించారు. ఇక తమన్నా భాటియా, రాశి కన్నా ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. రీసెంట్ గా ఈ సినిమాలోని ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసి మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ ను మొదలు పెట్టారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే బాక్ మూవీ నుంచి పంచుకో అనే వీడియో సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఇందులో రాశిఖన్నా తమన్నా గ్రేస్ ఫుల్ మూమెంట్స్ తెగ అట్రాక్టివ్ గా ఉన్నాయి. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి ఈ హీరోయిన్లు ఇద్దరు హాట్ హాట్ గా అందాల విందు చేశారు. ఈ ఒక్క పాటతోనే యూత్ మొత్తాన్ని తమ వైపుకు తిప్పుకున్నారు ఈ ఇద్దరు అందగత్తెలు. కానీ గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఇదేవిధంగా స్టెప్పులు వేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఇప్పుడిలా… అప్పుడలా…

గతంలో రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అందులో రవితేజ సరసన రాశి ఖన్నా, తమన్నా హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీలోనే వీళ్ళిద్దరూ రవితేజతో కలిసి రాయే రాయే అనే సాంగ్ లో స్టెప్పులు వేశారు. ఆ సాంగ్ బాగానే ఉన్నప్పటికీ పెద్దగా హిట్ అవ్వలేదు. పైగా సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడేమో ఈ ఇద్దరే కలిసి గ్లామర్ వలకబోస్తే గ్యాప్ లేకుండా వాళ్ళిద్దరి ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు. మరి ఇంతకీ దీనికి కారణం ఏంటి?

- Advertisement -

ఏం మారిందంటే?

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల అభిమానులు వాళ్లకు సంబంధించిన వీడియోలు వస్తే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమాన నటికి సంబంధించిన హాట్ హాట్ వీడియోలు రిలీజ్ అయితే వాటికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల కాలంలో తమన్నా ఏకంగా పలు శృంగార సన్నివేశాలలో నటించి ఫుల్ పాపులర్ అయింది. అదే విధంగా ఇప్పుడు బాక్ మూవీలోని పంచుకో సాంగ్ స్టిల్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు