WhistlePodu Song : సౌత్ రికార్డు కొట్టిన విజయ్.. మళ్ళీ తానే!

WhistlePodu Song : సౌత్ ఇండియా లో స్టార్ హీరోల హీరోల ఫ్యాన్స్ లో తలపతి విజయ్ ఫ్యాన్స్ వేరే అన్నట్టుంటుంది ప్రతి సారి. గత కొన్నాళ్లుగా విజయ్ నుండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఫ్యాన్స్ ట్రెండ్ అయ్యే దాకా వదలరు. రికార్డుల పని పట్టేదాకా ఊరుకోరు. కోన్ ప్లాప్ అయ్యే సినిమాలు విజయ్ ఫ్యాన్స్ బేస్ తో గట్టెక్కినవి ఉండడం విశేషం. ఇక యూట్యూబ్ రికార్డుల పరంగా అయితే విజయ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ముందున్నారు. గత కొన్నాళ్లుగా మామూలుగానే యూట్యూబ్ రికార్డుల విషయంలో సౌత్ లో మరే హీరోకి కూడా సాధ్యం కాని రేంజ్ లో ఈ ఒక్క హీరో సినిమా నుండే పాట వచ్చినా టీజర్, ట్రైలర్ ఏది వచ్చినా కూడా అవి యూట్యూబ్ లో రికార్డుల వర్షం కురిపిస్తూ దూసుకు పోతూ ఉంటాయి. మిగిలిన సౌత్ హీరోలు అందరూ కూడా ప్రస్తుతానికి ఈ హీరో తో పోల్చితే పలు రికార్డుల రేసులో వెనకే ఉన్నారు.

దళపతికే సొంతం ఈ రికార్డులు..

ఇక సౌత్ లో ముఖ్యంగా తమిళ నాట స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉన్నంత ఎవరూ ఉండరని చెప్పాలి. ఇక విజయ్ తలపతి త్వరలో పాలిటిక్స్ లో బిజీ అవ్వబోతున్న ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (GOAT Movie) మూవీ నుండి తాజాగా నిన్న ఫస్ట్ సాంగ్ విజిల్ పోడు (WhistlePodu Song) రిలీజ్ అవ్వగా భారీ వ్యూస్ తో దుమ్ము లేపిందని చెప్పాలి. అయితే విజయ్ రీసెంట్ సినిమాల పాటలతో పోల్చితే ఈ పాటకి యునానిమాస్ రెస్పాన్స్ ఏమి రాలేదు కానీ, ఉన్నంతలో పాటకి రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా వచ్చినా, యూట్యూబ్ లో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ తోనే దూసుకు పోతుంది. కాగా ఈ పాట విజయ్ కెరీర్ లో మరో 1 మిలియన్ లైక్స్ మార్క్ ని 24 గంటల లోపే అందుకున్న సాంగ్ గా సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా విజయ్ కెరీర్ లో ఇది వరకు కుట్టి స్టోరీ, బీస్ట్ మోడ్, బాడ్ ఆస్ మాన్, రంజితమే, జాలీ ఓ జింకానా, నా రెడీ మరియు అరబిక్ కుత్తు పాటలు రిలీజ్ అయిన 24 గంటల లోపే 1 మిలియన్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ నుండి విజిల్ పోడు సాంగ్ 8 వ 1 మిలియన్ మార్క్ లైక్స్ ని అందుకున్న సాంగ్ గా రికార్డ్ కొట్టేసింది.

వ్యూస్ లో అల్ టైం రికార్డు..

ఇక తాజాగా విజయ్ విజిల్ పొడు సాంగ్ అల్ టైం రికార్డు కొట్టేసింది. కోలివుడ్ లోనే కాదు టోటల్ సౌత్ లోనే 24 గంటల్లో 24.88 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని అల్ టైం రికార్డు వ్యూస్ దక్కించుకుంది. ఇక ఇంతకు ముందు కూడా విజయ్ నటించిన బీస్ట్ నుండి అరబిక్ కుత్తు సాంగ్ 23.77 మిల్లియన్లతో ఉండగా, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్ గుంటూరు కారం నుండి దమ్ మసాల 17. 42 మిలియన్ల తో ఉంది. ఇక సౌత్ లోనే అల్ టైం రికార్డులు టాప్ 10 లో ఐదు కి పైగా ఉన్న హీరోగా విజయ్ రికార్డ్ కొట్టగా మిగిలిన హీరోలు ఎవ్వరూ కూడా దరిదాపుల్లో కూడా లేరు. సాంగ్ పరంగా చూస్తే కాస్త, మహేష్ బాబు సాంగ్స్ రికార్డుల్లో అప్పుడప్పుడూ రచ్చ చేస్తాయని చెప్పాలి. ఇక GOAT సినిమా నుండి వచ్చే ఇతర పాటలు కూడా ఇదే రేంజ్ లో రచ్చ చేస్తాయేమో చూడాలి. ఇటు తెలుగు నుండి కూడా పలువురు టాప్ స్టార్స్ మూవీ సాంగ్స్ రెడీ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు