Shankar : రిలీజ్ డేట్స్ విషయంలో శంకర్ మైండ్ గేమ్స్… చెర్రీతో కూడా అదే పని ?

Shankar : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ప్రేక్షకుల సహనానికి చాలాకాలంగా పరీక్ష పెడుతూ వస్తున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోంది ఆడియన్స్. ఇక తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా కేవలం రిలీజ్ మంత్ ను మాత్రమే ప్రకటించి కొత్త ట్రెండుకు తెర తీశారు శంకర్. ఆయన అలా చేయడమే కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా అదే పని చేయిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఏది?

‘గేమ్‌ ఛేంజర్‌’లో రామ్‌ చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇదొక పొలిటికల్ వై యాక్షన్ డ్రామా. రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్, నాజర్, జయరామ్, అంజలి, సముద్రఖని తదితరులు ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని మొదటి పాట ‘జరగండి’ రిలీజ్ కాగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ మూడేళ్లుగా జరుగుతోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం పట్ల మెగా అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇదే వేదికపై రామ్ చరణ్ తన కొత్త చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ గురించి మాట్లాడారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేస్తామని చెర్రీ తెలిపాడు. కానీ రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. దీనికి చెర్రీని ఏమాత్రం తప్పు పట్టలేము. మొత్తం డైరెక్టర్ శంకర్ డే ఈ తప్పంతా. ఆయన ఇంకో మూవీ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

- Advertisement -

ఇండియన్ 2ది కూడా సేమ్ కథే

లోకనాయకుడు కమలహాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో భారతీయుడు సినిమాతో ఈ కాంబో సంచలనం సృష్టించగా, సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఎన్నో అవాంతరాలను దాటుకుని పట్టాలెక్కిన ఈ మూవీ రిలీజ్ డేట్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇండియన్ 2 మూవీని జూన్ లో రిలీజ్ కాబోతుందని వెల్లడించారు. అయితే డేట్ విషయంలో మాత్రం సస్పెన్స్ అలాగే కంటిన్యూ చేశారు. కానీ జూన్ 13న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా తాను రూపొందిస్తున్న రెండు సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో శంకర్ సస్పెన్స్ మెయింటైన్ చెయ్యడంతో సినీ ప్రియులు మండిపడుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈ మైండ్ గేమ్స్ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లను అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు