Good Bad Ugly : అజిత్ తో అగ్లీ ఫైట్… యానిమల్ విలన్ కు మరో బంపర్ ఆఫర్

Good Bad Ugly : యానిమల్ లో మాటలు లేకుండా కేవలం ఫైట్స్ తోనే అదరగొట్టిన బాబీ డియోల్ పై ఇప్పుడు పాన్ ఇండియా మేకర్స్ కన్ను పడింది. ఇప్పటికే పలు బిగ్ ప్రాజెక్ట్స్ లో భాగమైన బాబీకి సౌత్ నుంచి మరో బంపర్ ఆఫర్ తగిలినట్టు సమాచారం. ఈ బాలీవుడ్ విలన్ తమిళ స్టార్ హీరో అజిత్ తో అగ్లీ ఫైట్ కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

గుడ్ బ్యాడ్ అగ్లీలో బాబీ డియోల్ ?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం తన 62వ మూవీ విడా ముయార్చితో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ చేస్తూనే నెక్స్ట్ మూవీని కూడా లైన్లో పెట్టారు ఈ సీనియర్ హీరో. ఇది అజిత్ కెరియర్ లో 63వ సినిమా కాగా, గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అధిక్ రవిచంద్రన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నేషనల్ అవార్డు గ్రహీత దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించబోతుండడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అలాగే ఇంకా నటీనటుల ఎంపిక కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్ ఈ మూవీలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ ని సంప్రదించినట్టుగా సమాచారం. మరి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

గుడ్ బ్యాడ్ అగ్లీ లేటెస్ట్ అప్డేట్…

గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కోసం రీసెంట్ గా అజిత్ ఒక టెస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జూన్ లేదా జూలైలో ప్రారంభం కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో అజిత్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటించబోతున్నారని, అది కూడా బాలీవుడ్ భామలని ప్రచారం జరుగుతుంది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అజిత్ ఏకంగా మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. 2006లో రిలీజ్ అయిన వరలారు మూవీలో కూడా అజిత్ మూడు పాత్రలు పోషించి మెప్పించాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు అజిత్ కు తమిళనాడు రాష్ట్ర అవార్డును సంపాదించి పెట్టింది. ఈ నేపథ్యంలోనే మరోసారి అజిత్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు అని వస్తున్న వార్తలు ఆయన అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతున్నాయి.

- Advertisement -

బాబీ డియోల్ సినిమాల విషయానికి వస్తే…

బాబి డియోల్ ప్రస్తుతం సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సూర్య కంగువా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, బాలయ్య ఎన్బికె 109 వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. మరో వైపు పలు హిందీ సినిమాల్లో కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ బిజీ షెడ్యూల్ లో ఆయన అజిత్ కోసం డేట్స్ కేటాయిస్తారా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు