Manjummel Boys : లాంగ్ రన్ లో తెలుగు వెర్షన్ జోరు.. ఏకంగా డబుల్..

Manjummel Boys : మలయాళ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మేల్ బాయ్స్ థియేటర్ల వద్ద ఇప్పటికి లాంగ్ రన్ లో దుమ్ము లేపుతుంది. ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఈ సినిమా కలెక్షన్లు. నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం మలయాళం ఇండస్ట్రీ చూపిస్తున్న జోరు ఏ ఇండస్ట్రీలోనూ లేదని చెప్పాలి. అక్కడి నుండి ఏ సినిమా వచ్చినా అది బ్లాక్ బస్టర్ అయి కూర్చుంటుంది. జోనర్, హీరో అలాంటిది ఏమి పట్టించుకోకుండా ఆడియన్స్ ఎలాంటి సినిమానైనా హిట్ చేసే పడేస్తున్నారు. ఆ మధ్య ప్రేమలు, భ్రమయుగం, లేటెస్ట్ గా ఆడు జీవితం ఈ సినిమాలన్నీ వంద కోట్ల బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. ఇక మలయాళంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి, అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయి ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా మంజుమ్మేల్ బాయ్స్. దాదాపు 220 కోట్ల కి పైగా కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఆ సినిమా తెలుగులో కూడా రికార్డు కలెక్షన్లతో దుమ్ము లేపుతుంది. దీంతో పాటు రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ పోటీని తట్టుకుని కూడా, అందరి అంచనాలను అధిగమించి మంజుమ్మేల్ బాయ్స్ సినిమా తెలుగులో కూడా రికార్డ్ వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమా జోనర్ దృశ్యా చూసుకుంటే షో షోకి కలెక్షన్స్ పరంగా లాంగ్ రన్ లో జోరు చూపిస్తూ దుమ్ము దుమారం లేపింది.

డబుల్ మార్జిన్ తో బ్లాక్ బస్టర్..

మలయాళంలో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన మంజుమ్మేల్ బాయ్స్ (Manjummel Boys) తెలుగు లో రీసెంట్ గా డబ్ అవగా, మంచి స్టార్ట్ తర్వాత కొంచం స్లో అయినా కూడా, ఆ తర్వాత ఉగాది, రంజాన్ అండ్ వీకెండ్ అడ్వాంటేజ్ లు లభించడంతో రోజు రోజుకి కలెక్షన్స్ లో మంచి గ్రోత్ ని చూపించిన ఈ సినిమా, తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది. సినిమా తెలుగు వాల్యూ బిజినెస్ రేంజ్ 2.5 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ మార్క్ ని దాటేసి లాభాలను కూడా సాలిడ్ గా అందుకుంది. మొదటి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఆ తర్వాత బిజినెస్ కి ఆల్ మోస్ట్ డబుల్ అనిపించేలా తర్వాత 5 రోజుల కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో టోటల్ గా 9 రోజుల్లో ఏకంగా 8.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది. షేర్ మొత్తం మీద 4.50 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా బిజినెస్ మీద సాలిడ్ గా లాభాలను సొంతం చేసుకుంది మంజుమ్మేల్ బాయ్స్.

తెలుగునాట జోరు..

ఇక మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) తెలంగాణ లో 2.30 కోట్ల షేర్, ఆంధ్ర ప్రదేశ్ లో 2.20 కోట్ల షేర్ ని రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.50 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గా కుమ్మేసిన ఈ సినిమా ఈ ఇయర్ లో టాలీవుడ్ లో డబ్ అయిన మూవీస్ లో ప్రేమలు తర్వాత రెండో డబ్ హిట్ మూవీగా నిలిచింది. కానీ సినిమా ఓవర్సీస్ లో తెలుగు వర్షన్ మాత్రం ఎందుకో అంతగా అంచనాలను అందుకోలేక పోయింది. బహుశా మలయాళం వెర్షన్ రిలీజ్ అయ్యాక చాలా రోజులు గ్యాప్ రావడం వల్ల అయి ఉండొచ్చు. ఇక మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ రన్ లో ఈ సినిమా 10 కోట్ల మార్క్ ని దాటే అవకాశం ఉందని చెప్పాలి. ఇక రీసెంట్ గా మలయాళంలో ఫహద్ ఫజిల్ నటించిన ఆవేశం బ్లాక్ బస్టర్ టాక్ తో దుమ్ము లేపుతుండగా ఆ సినిమాని కూడా తెలుగులో త్వరలోనే డబ్ చేయనున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు