Aavesham : బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ‘ఫాఫా’ సినిమా..సెంచరీ పక్కా..

Aavesham : మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు మలయాళం ఇండస్ట్రీకే పరిమితమైన ఈ టాలెంటెడ్ స్టార్ ఇప్పుడు సౌత్ మొదలుకొని బాలీవుడ్ వైపు కూడా పరుగులు తీస్తున్నాడు. ఫ్యాన్స్ ముద్దుగా ఫాఫా అని పిలుచుకునే ఈ నటుడి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఒక్క మలయాళం లోనే కాదు, సౌత్ వ్యాప్తంగానూ ఎంతో ఖ్యాతి గాంచాడు. ఎలాంటి పాత్రలోనైనా రఫ్ ఆడించగల దిట్ట ఈయన. నాలుగేళ్ళ కింద ట్రాన్స్ అనే ఓటిటి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన ఫహద్, తెలుగులో పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాడు. ఆ సినిమాలో నిజంగా పుష్ప రాజ్ ని మించిన రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. కేవలం ఆ ఒక్క బ్లాక్ బస్టర్ అతని డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగులో వెల్లువలా వచ్చేలా చేసింది.

బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు..

ఇదిలా ఉండగా తాజాగా ఫహద్ ఫజిల్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఆవేశం’(Aavesham) గురువారం ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజయ్యి మలయాళంలో ఫస్ట్ షో కే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని సాలిడ్ కలెక్షన్లతో దుమ్ము లేపుతుంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫహాద్ ఫాజిల్ నటించిన ఇతర సినిమాలు మెల్లిగా ఓపెనింగ్స్ తెచ్చుకుని లాంగ్ రన్ లో పికప్ అయ్యేవి. కానీ లేటెస్ట్ మూవీ ఆవేశం సినిమా మీద మలయాళంలో ముందు నుండే అంచనాలు ఏర్పడగా రీసెంట్ గా రంజాన్ కానుకగా వచ్చిన ఈ సినిమా మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా, ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ 3 రోజుల్లో అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఈ సినిమా 3 రోజుల్లో కేరళలో పోటిలో 10 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేయగా టోటల్ గా ఇండియాలో 13 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. మలయాళ సినిమాలకు ఓవర్సీస్ లో సాలిడ్ మార్కెట్ ఉండగా ఈ సినిమా ఒక్క ఓవర్సీస్ నుండే 3 రోజుల్లో ఏకంగా 21 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుందట. దాంతో మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరింత జోరు చూపించే అవకాశం ఉండగా 42 కోట్ల రేంజ్ లో వసూళ్లతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా ఎంజాయ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

సెంచరీ దిశగా..

ఇక ఆవేశం (Aavesham) సినిమాకి రెస్పాన్స్ కూడా బాగుండటంతో త్వరలో తెలుగు డబ్ వర్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటూ ఉండగా, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకు పోతున్న మలయాళ ఇండస్ట్రీ నుండి ఈ సినిమా మరో 100 కోట్ల సినిమాగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక ఒక్క కేరళలోనే కాదు, తెలుగు డబ్బింగ్ చేయకపోయినా, హైదరాబాద్ లో ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ సబ్ టైటిల్స్ తో మల్టీప్లెక్స్ లో సినిమాని చూస్తున్నారు. అయితే ఈ సినిమాని మళయాళంతో పాటు తెలుగులో కూడా ముందే రిలీజ్ చేయాల్సి ఉండగా, సినిమా ఫలితం చూశాక తెలుగు రిలీజ్ నిర్ణయించాలని నిర్మాతలు భావించడంతో మన దాకా రాలేదు. ఇక అతి త్వరలోనే తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు