Fahadh Faasil : ఫాహద్ ఖాతాలో రెండు మెగా ప్రాజెక్ట్స్… రాజమౌళిదే కీ రోల్

ఊహించని క్రేజీ కాంబినేషన్ ఒకటి తెరపైకి రాబోతోంది. టాలెంటెడ్ మలయాళ స్టార్ ఫాహద్ ఫాసిల్ హీరోగా ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం విశేషం. ఇక దీని వెనక దర్శకుడు రాజమౌళి ఉండడం గమనార్హం. ఇంతకీ ఆ ప్రాజెక్ట్స్ ఏంటి? దీని వెనక జక్కన్న పాత్ర ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

తెరపైకి ఫాహద్, జక్కన్న క్రేజీ కాంబో…
ప్రస్తుతం భాష అనే సరిహద్దులు చెరిగిపోయాయి. టాలెంట్ ఉంటే చాలు ఇతర భాషలకు సంబంధించిన నటీనటులు, దర్శకులు సైతం టాలీవుడ్ స్టార్స్ తో పని చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెరపైకి రాజమౌళి, మలయాళ స్టార్ ఫాహద్ ఫాసిల్ కాంబో వచ్చింది. ఇలా అనగానే రాజమౌళి దర్శకత్వంలో ఫాహద్ హీరోగా చేస్తున్నాడేమో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే రెండు సినిమాలకు రాజమౌళి దర్శకుడు కాదు, ప్రెజెంటర్ మాత్రమే. బాహుబలి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, రాజమౌళి తనయుడు కార్తికేయ సంయుక్తంగా ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. అలాగే ఈ రెండు సినిమాలకు రాజమౌళి సమర్పకుడిగా ఉండడం గమనార్హం. మార్చ్ 19న ఫాహద్ హీరోగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందులో ఒక మూవీకి ఆక్సిజన్, మరొక మూవీకి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఈరోజే రిలీజ్ చేశారు టీం. షోయింగ్ బిజినెస్ బ్యానర్ పై కార్తికేయ, ఆర్కా మీడియాపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల ద్వారా కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నారు. అలాగే కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించబోతున్నారు.

“ఆక్సిజన్” స్టోరీ లైన్ ఇదే…
ఆక్సిజన్ మూవీతో కొత్త దర్శకుడు సిద్ధార్థ నాదెళ్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఫ్రెండ్షిప్ ప్రధాన అంశంగా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఫాహద్ హీరోగా నటిస్తుండగా, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ క్యూరియాసిటీని పెంచేసింది. మాస్క్ ధరించిన హీరో ఫేస్ పై మ్యాప్ ఉండడం, ఫాహద్ కళ్ళు ఇంటెన్స్ గా ఉండటమే ఫస్ట్ లుక్ లోని విశేషాలు. 2024 లోనే ఆక్సిజన్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.

- Advertisement -

బాలయ్య డైలాగ్ ను కొట్టేసిన మలయాళ హీరో…
ఇక మరో సినిమాకు బాలయ్య పాపులర్ డైలాగ్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మూవీకి కొత్త దర్శకుడు శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఇది ఫాంటసీ డ్రామాగా రూపొందనుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ లో ఫాహద్ చిన్న పాపతో కలిసి కనిపించారు. 2025లో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు