Balayya: సక్సెస్ దిశగా బాలయ్య.. ఆమె జాతకం వల్లేనా..?

ప్రతి ఒక్కరి జీవితంలో.. ఎవరో ఒకరు వారి సక్సెస్ కి సహాయపడతారు అనడం లో సందేహం లేదు. ఒక భర్త కు భార్య అయినా అవ్వచ్చు లేదా ఒక తండ్రికి కూతురైన అవ్వచ్చు.. ఇలా ఎవరో ఒకరు తమ సక్సెస్ కు సహాయపడతారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా తమ సినీ కెరియర్ సక్సెస్ కు తమ భార్య లేక తమ తల్లి లేదా తమ కూతురు ఇలా ఎవరో ఒకరి పేరు చెబుతూ తమ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే నందమూరి హీరోగా మరింత పాపులారిటీ దక్కించుకున్న బాలయ్య కెరియర్ సక్సెస్ అవ్వడానికి కూడా ఒకరు ఉన్నారని ప్రత్యేకించి ఆమె జాతకం వల్లే ఆయన కెరియర్ అటు సినిమాల పరంగా ఇటు రాజకీయపరంగా మరింత ఉన్నతంగా ఉందని సమాచారం. మరి బాలయ్య కెరియర్ ను సక్సెస్ఫుల్గా మార్చిన ఆమె ఎవరు? ఆమె జాతకంలో ఏముంది ?అనేది ఇప్పుడు చూద్దాం. ఇకపోతే బాలయ్య ప్రస్తుతం వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లర్ అందుకుంటూ రూ .100 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

2024 సంవత్సరంలో 100 కోట్ల రూపాయల షేర్ కలలు కూడా బాలయ్య తీర్చుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఇండస్ట్రీకి చెందిన చాలామంది విశ్లేషకులు బ్రాహ్మణి పుట్టిన తర్వాతనే బాలయ్య సినీ కెరియర్ కు కలిసి వచ్చిందని చెబుతున్నారు. అంతేకాదు బ్రాహ్మణి పుట్టకముందు కూడా బాలయ్య విజయాలు సాధించినా.. ఆమె పుట్టిన తర్వాతే బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు వచ్చాయని.. బ్రాహ్మణి జాతకం మహ్ర్జాతకం అని ఆమె వల్ల కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుందని.. ఆమె వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవని.. ఆమె ఎక్కడుంటే అక్కడున్న వారంతా సంతోషంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చెబుతున్నారు.

- Advertisement -

ఇక బాలయ్య ప్రస్తుతం పొలిటికల్ కెరియర్ కంటే సినీ కెరియర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 2024లో ఎన్నికల సమయానికి బాబీ మూవీ ని కూడా రిలీజ్ చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తుండగా… ఈ సినిమాలో తన లుక్కు చాలా కొత్తగా ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న బాలయ్య ఇక సినిమాల పరంగా సినిమాల ఫలితాల విషయం ఏమాత్రం తప్పడం లేదు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా బాలయ్య సినీ, రాజకీయ సక్సెస్ కు ఆయన పెద్ద కూతురు బ్రాహ్మణి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు