TS Assembly elections 2023: టాలీవుడ్ హీరోలు ఎక్కడ ఓటేస్తారో తెలుసా..?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హోరు మొదలయ్యింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 30న అంటే రేపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లలో భాగంగా మీ అభిమాన హీరోలు ఎవరు? ఎక్కడ? ఓటెయ్యబోతున్నారో ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి:

Do you know where Tollywood heroes vote?
జూబ్లీహిల్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 149 లో మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరితోపాటు హీరో నితిన్, రామ్ చరణ్ దంపతులు ఇక్కడే ఓటు వేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

అల్లు అర్జున్:

Do you know where Tollywood heroes vote?
బిఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ నంబర్ 153 లో అల్లు అర్జున్ అలాగే ఆయన భార్య స్నేహారెడ్డి తో పాటు అల్లు అరవింద్,అల్లు శిరీష్ ఇక్కడే ఓటు వేయనున్నారు.

మహేష్ బాబు:

Do you know where Tollywood heroes vote?

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 165 లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రత తో కలిసి ఇక్కడే ఓటు వేయనున్నారు.

మోహన్ బాబు:

Do you know where Tollywood heroes vote?
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 165 లో మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్ , మంచు విష్ణు కూడా ఇక్కడే ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్:

Do you know where Tollywood heroes vote?
ఓబుల్ రెడ్డి స్కూల్ దగ్గర ఉన్న పోలింగ్ బూత్ నంబర్ 150 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఆయనతోపాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు.

అక్కినేని నాగార్జున:

Do you know where Tollywood heroes vote?
వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 151 లో నాగార్జున , ఆయన భార్య అమల, వారి వారసులు నాగచైతన్య, అఖిల్ కూడా ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

విజయ్ దేవరకొండ:

Do you know where Tollywood heroes vote?
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ నంబర్ 164 లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తో పాటు నటుడు శ్రీకాంత్ కూడా తమ ఓటు హక్కును ఇక్కడే వినియోగించుకోనున్నారు.

ప్రభాస్:

Do you know where Tollywood heroes vote?
మణికొండ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రభాస్ ఓటు వేయనున్నారు. ఈయనతో పాటు అనుష్క, బ్రహ్మానందం, వెంకటేష్ కూడా ఓటు వేయనున్నారు.

ఇక వీరితో పాటూ పలువురు సెలబ్రిటీలు తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు సమాచారం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify-

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు