Krithi Sanon & Nupur Sanon : నో ఆఫర్స్… క్రేజీ సిస్టర్స్ ను పక్కన పెట్టేసిన టాలీవుడ్

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ల కరువు గట్టిగా ఉంది. అయితే ఇప్పటికే ఉన్న హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదు. ఉన్న ఒకరిద్దరు హీరోయిన్లను మాత్రమే వాడేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఫ్రెష్ ఫేస్, కొత్తదనం కోసం ఎదురు చూస్తోంది టాలీవుడ్. ఈ నేపథ్యంలోనే కొందరు హీరోయిన్లకు చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఆ లిస్టులోనే చేరిపోయారు క్రేజీ సనమ్ సిస్టర్స్.

టాలీవుడ్ లో “నేనొక్కడినే” మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఫస్ట్ మూవీనే డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీంతో టాలీవుడ్ చూపు మరోసారి కృతి సనన్ పై పడింది. బాలీవుడ్ లో ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగా “ఆదిపురుష్” మూవీతో ఆమెను పాన్ ఇండియా హీరోయిన్ గా పరిచయం చేశారు ప్రభాస్. అయితే ఆ మూవీ కూడా అంచనాలను అందుకోకుండా కృతి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఇలా తెలుగులో కృతి చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. నేనొక్కడినే, దోచేయ్, ఆదిపురుష్ సినిమాలతో టాలీవుడ్ లో హ్యాట్రిక్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది కృతి సనన్.

ఇక రీసెంట్ గా కృతి సనన్ తన చెల్లెలు నుపూర్ సనన్ ను “టైగర్ నాగేశ్వరరావు” సినిమాతో టాలీవుడ్ కు పరిచయం చేసింది. మొదటి సినిమానే మాస్ మహారాజ రవితేజ లాంటి హీరోయిన్ తో చేసినప్పటికీ, ఈ హీరోయిన్ ప్లాప్ మూటగట్టుకుంది. దీంతో టాలీవుడ్ నుంచి ఒక్క ఆఫర్ కూడా అందుకోలేదు ఈ అమ్మడు. మరి టాలీవుడ్ లోనే నుపూర్ పరిస్థితి ఇలా ఉంటే బాలీవుడ్లో ఆమెను అవకాశాలు పలకరించే ఛాన్స్ చాలా తక్కువ. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవడంతో ఈ అక్కా చెల్లెలు ఇద్దరిని టాలీవుడ్ ఐరన్ లెగ్ గా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. హీరోయిన్ల కొరత ఉన్న ఇలాంటి సమయంలో కూడా ఈ బ్యూటీలు ఇద్దరూ హీరోయిన్లుగా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోవడం గమనర్హం. అందం ఉన్నప్పటికీ ఈ అక్కా చెల్లెళ్ళిద్దరికి టాలీవుడ్ లో కాలం కలిసి రావడం లేదు. ఆ లక్ గనక కొంచెం కలిసి వచ్చి ఉంటే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లిపోయేది నుపూర్. మరి టాలీవుడ్ లో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు అసలు నెక్స్ట్ ఎవరైనా చాన్స్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే అప్పుడైనా అదృష్టం కలిసి వస్తుందా ? అనేది అనుమానమే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify-

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు