Sandeep Reddy Vanga: అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సెట్ చేసిన “అనిమల్”..

డిసెంబర్ 1న రిలీజ్ అవుతున్న అనిమల్ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి కారణం సందీప్ రెడ్డి వంగ. ఈ డైరెక్టర్ తీసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల మేకింగ్ స్టైల్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు రాబోతున్న అనిమల్ కి కూడా మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గరనుండి ఈ సినిమా పై ఎన్ని అంచనాలు పెరిగాయో మనకి తెల్సిందే. అనిమల్ నుండి సాంగ్ వచ్చినా, టీజర్, ట్రైలర్ ఏది వచ్చినా అలా ట్రెండ్ అయ్యేది. సందీప్ రెడ్డి అనిమల్ ని డైరెక్ట్ చేయడం వల్ల దాని కోసం తెలుగులో కూడా చాలా వెయిట్ చేస్తున్నారు.

ఇక అనిమల్ కోసం హైదరాబాద్ లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. అనిమల్ సినిమా కి ఒక్క హైదరాబాద్ సిటీ లో ఇప్పటివరకు 3.20 కోట్ల గ్రాస్ అడ్వాన్సు బుకింగ్స్ ద్వారా జరిగింది. ఇంకా రెండు రోజుల్లో దీనికి డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంతే కాదు హైదరాబాద్ లో దాదాపు 550 కి పైగా షోలు అనిమల్ కి పడనున్నాయి. ఇక ఇంతకు ముందు రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమా జవాన్ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ని అనిమల్ లేపేసి టాప్ ప్లేస్ ని దక్కించుకోవడం విశేషం.

- Advertisement -

ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం అనిమల్ సినిమాకి కేవలం తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే జరుగుతున్న బుకింగ్స్ ని బట్టి అనిమల్ కి వరల్డ్ వైడ్ 100 కోట్ల ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు