Mythri movie makers : ప్రేమలు ఊపులోనే ఇదంతా.. అందరికీ రావాలని ఉండదుగా?

Mythri movie makers : టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మలయాళం డబ్బింగ్ సినిమాల జోరు బాగా పెరిగింది. ఈ సంవత్సరం గడిచిన నాలుగు నెలలలో మలయాళంలో దాదాపు ఎనిమిదికి పైగా బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి మలయాళంలో అది కూడా అన్ని సినిమాలు లో బడ్జెట్ లో తెరకెక్కి ఓ రేంజ్ లో హిట్ అయిన సినిమాలే. స్టార్టింగ్ లో రెండు నెలల కింద రిలీజ్ అయిన భ్రమయుగం మమ్మూట్టి కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా నిలవగా, రెండు నెలల కింద రిలీజ్ అయిన మంజుమ్మేల్ బాయ్స్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక మొన్నామధ్య రిలీజ్ అయిన ప్రేమలు, ఆడు జీవితం తో పాటు, లేటెస్ట్ గా మలయాళంలో రిలీజ్ అయిన ఆవేశం సాలిడ్ హిట్ టాక్ తో రన్ అవుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా మలయాళంలో హిట్ అయిన ప్రతి సినిమా ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి. అందులో మైత్రి మూవీ మేకర్స్ బాగా ఫోకస్ చేస్తుందని చెప్పాలి. కానీ వారికి సరైన హిట్టు మాత్రం దక్కడం లేదు. దానికి కారణం ఏదైనా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన తెలుగులో హిట్ అవ్వాలన్న రూల్ ఏమి లేదు.

మైత్రికి డబ్బింగ్ సినిమాలు కలిసి రాలేదా?

ఈ మధ్య కాలంలో ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కంటే మరే ఇతర పెద్ద నిర్మాణ సంస్థ బ్యాక్ టు బ్యాక్ డబ్బింగ్ చిత్రాలను తీసుకురాలేదు. తెలుగు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించి సలార్, హనుమాన్ వంటి చిత్రాలతో భారీ లాభాలు వెనకేసుకున్న మైత్రి ఇటీవల మూడు డబ్బింగ్ చిత్రాలను కూడా విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యారు. కొన్ని రోజుల కింద ముందుగా మైత్రి పృథ్వీరాజ్ సుకుమారన్ యొక్క పలు ప్రశంసలు పొందిన చిత్రం, ఆడు జీవితం ది గోట్ లైఫ్ సినిమాను డబ్ చేయగా, ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకున్నా తెలుగు ఆడియన్స్ కి ఈ లెంగ్తి డ్రామా ఎక్కలేదు. ఇక రీసెంట్ గా మలయాళ పరిశ్రమ యొక్క ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం అక్కడ ₹200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మెల్ బాయ్స్ తాజాగా తెలుగులో డబ్ చేయగా, ఈ సినిమా మొదట బుకింగ్స్ బాగానే చేసినా, అంతగా ఓపెనింగ్స్ రాలేదు. ఏదో పండగల ఊపులో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. తాజాగా మైత్రి(Mythri movie makers) విజయ్ ఆంటోని తమిళ చిత్రం లవ్ గురు కూడా రిలీజ్ చేయగా, ఈ సినిమా రొటీన్ టాక్ తో ప్లాప్ గా నిలిచింది.

ప్రేమలు రేంజ్ లో అంచనాలు పెంచుకుంటే ఎలా?

అయితే ఆ మధ్య ప్రేమలు సినిమా కార్తికేయ తక్కువ ఖర్చుతో కొని తెలుగులో రిలీజ్ చేయగా, అనూహ్యంగా ఆ సినిమా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయి భారీ లాభాల్ని తెచ్చింది. అయితే ఆ సినిమా అంత హిట్ కావడానికి కొన్ని కారణాలున్నాయి. ప్రేమలు హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం వల్ల, పైగా యూత్ కి సంబంధించిన కామెడీ, అన్నిటికి మించి తెలుగునేటివిటి డైలాగ్స్ ఉండడం వల్ల సినిమా ఓ రేంజ్ లో ఆడింది. కానీ మలయాళం సినిమాలు మంజుమ్మేల్ బాయ్స్, ఆడు జీవితం మలయాళం టేస్ట్ తో తెరకెక్కగా, ఎమోషనల్ డ్రామాలు తెలుగు ఆడియన్స్ కి అంతగా ఎక్కవు. ప్రేమలు ఊపులో మైత్రి వారు మలయాళం సినిమాలని కొన్నట్టున్నారు. అన్ని సినిమాలు అలా హిట్ కావాలని రూల్ లేదు కదా… అని ఒకరకంగా మైత్రి మేకర్స్ కి నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు