Manjummel Boys : మలయాళ ఇండస్ట్రీ హిట్.. తెలుగులోనూ బ్రేక్ ఈవెన్.. మైత్రికి లాభాల పంటే?

Manjummel Boys : మలయాళంలో ఈ మధ్య ఏ సినిమా వచ్చినా అది బ్లాక్ బస్టర్ అయి కూర్చుంటుంది. జోనర్, హీరో అలాంటిది ఏమి పట్టించుకోకుండా ఆడియన్స్ ఎలాంటి సినిమానైనా హిట్ చేసే పడేస్తున్నారు. ఆ మధ్య ప్రేమలు, భ్రమయుగం, లేటెస్ట్ గా ఆడు జీవితం ఈ సినిమాలన్నీ వంద కోట్ల బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. ఇక మలయాళంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి, అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయి ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా మంజుమ్మేల్ బాయ్స్. దాదాపు 220 కోట్ల కి పైగా కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఆ సినిమా లేటెస్ట్ గా తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా, ఇక్కడ కూడా యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో పాటు ఫ్యామిలీ స్టార్ పోటీని తట్టుకుని కూడా, అందరి అంచనాలను అధిగమించి మంజుమ్మేల్ బాయ్స్ సినిమా తెలుగులో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. ఇక మంజుమ్మేల్ బాయ్స్ మళయాళంలో ఎలాంటి టాక్ తెచ్చుకుందో తెలుగులో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ సినిమా జోనర్ దృశ్యా చూసుకుంటే షో షోకి కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ దుమ్ము దుమారం లేపింది.

తెలుగులోనూ బ్రేక్ ఈవెన్!

ఇక తెలుగులో మంజుమ్మేల్ బాయ్స్ ఏప్రిల్ 6న రిలీజ్ కాగా, ఇక్కడ ఫ్యామిలీ స్టార్ వల్ల లిమిటెడ్ స్క్రీన్స్ దొరికినా, ఆ ఎఫెక్ట్ ఫస్ట్ డే పడ్డా మంచి ఓపెనింగ్స్ సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన సెన్సేషనల్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ ఇక్కడ మంచి జోరుని చూపిస్తూ 2 రోజుల వీకెండ్ లో 2 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ వర్కింగ్ డే లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద మూడో రోజు 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 4వ రోజు సినిమా మంచి జోరుని చూపించి ఆల్ మోస్ట్ 35 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక నాలుగవ రోజు కలెక్షన్స్ తో మంజుమ్మేల్ బాయ్స్ తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించిందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా వాల్యూ టార్గెట్ ను కూడా దాటేసి హిట్ గీతని దాటింది అని చెప్పాలి.

మైత్రికి ఇక లాభాలే?

ఇక తెలుగు లో ఈ ఇయర్ రిలీజ్ అయిన డబ్ మూవీస్ లో ప్రేమలు తర్వాత మంజుమ్మేల్ బాయ్స్ (Manjummel Boys) సినిమా మరో మళయాళ హిట్ గా తెలుగు లో నిలవడం విశేషం. ఇక నాలుగురోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నైజాం లో 1.35 కోట్ల షేర్, ఆంధ్ర లో 1.27 కోట్ల షేర్ రాబట్టగా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 2.62 కోట్ల షేర్, 4.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం మీద సినిమా తెలుగు లో వాల్యూ టార్గెట్ 2.5 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ మార్క్ ని దాటేసిన సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ సినిమాను తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేయగా, తాజాగా బ్రేక్ ఈవెన్ అయ్యాక, తెలుగు లో లాంగ్ రన్ లో మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 230 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండటం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు